న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఎన్నికల సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్.. తన నామినేషన్ పత్రాల్లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించలేదని, అందుకు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కె కౌల్, జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి దేవేంద్ర ఫడ్నవీస్‌ను స్పందించాలని అడుగుతూ నోటీసులు జారీచేసింది. ఫడ్నవీస్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సతీశ్ ఊకే అని వ్యక్తి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సతీశ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు పంపింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సుప్రీం నోటీసులు
RELATED ARTICLES