సృష్టినేసృష్టించి,సృష్టిచే జనియించి, సృష్టిలో
అలలపై ఆటుపోటులతో పరిగెడుతున్న కడలి చందంగా
లీన అలీన, కల్పిత వాస్తవ నమ్మకాల
వారధిపై పయ్రాణిస్తున్నది “దైవం”…
“మనిషిమనిషిలో లీనమై తాను ఉంటాడటా
అదికాక మరి వసతి కావాలటా
తనని ఎవరు వేడినా వరములిస్తాడటా
వేడని వాని కష్టాలచే లొంగదీస్తాడటా”
“ఎవడు ఏ రీతిలో పిలిచినా పలికేది అతడో ?
మరి అంతా ఒకడేనని తెలిపేది ఎవడో…
తెలిపినా, తెలిసినా నా మతం నాదేనని
ఉన్న మతంలోనే శైవమో, వైష్టవమో తేల్చుకో లేకున్నారు
ఉన్నాడో, లేదో ఊహకందని పశ్న్ర
కల్పిత రథయాత్ర మాత్రం లోక తీరాలను తాకుతుంది..”
ఎక్కడో ఉన్నావు చోద్యం చూస్తున్నావు
ఆస్తీ నాస్తీ ‘కుల’ సమరం తిలకిస్తు న్నావు
నాకెందుకులే అని, అలంకార పియ్రుడవై
శోభాయమానంగా, భిల్లుతున్నావు
ఆర్థనాదం నీకు వినిపించటం లేదా
అవనియందలిఘోష కనిపించటం లేదా
ఏమీ పట్టని నీవు మమ్ము ఎందుకు సృష్టించావు
ప్రారబ్ధం పేర నీవైపు ఎందుకు పరిభమ్రీపిస్తున్నావు…
ఇదంతా నేనంటున్నది కాదు….
ఈ లోకంలో అరాచకం నీకు కనిపి ంచనంత వరకు
ఏ లోకంలో నువ్వున్నా మాకు కనిపించవు…
“ఇది నాస్తిక వాదన కాదు
నిరసన భావనే…!”
బొడ్డుపల్లి సాయిశంకర్ చారి
8978972067