HomeLiteratureదక్షిణాదిన ద్రవిడ ఉద్యమానికి పునాది

దక్షిణాదిన ద్రవిడ ఉద్యమానికి పునాది

1911 జనాభా లెక్కల ప్రకారం, మద్రాసు ప్రెసిడెన్సీ జనాభాలో బ్రాహ్మణులు మూడు శాతం కంటే కొంచెం ఎ క్కువగా, బాహ్మణేతరులు 90 శాతంగా ఉన్నారు. అయినా, 1901 నుండి 1911 వరకు గల 10 ఏళ్ళ మధ్యకాలంలో మద్రాసు యూనివర్శిటీ 4,074 బ్రాహ్మణ గ్రాడ్యుయేట్లను తయారు చేయగా, కేవలం 1035 బ్రాహ్మణేతరులు గ్రాడ్యుయేట్లు అయ్యారు. ఇతర గ్రూపులకు చెందిన అంకెలు, ఆ సమయంలో ప్రజల్ని ప్రభుత్వం ఎలా వర్గీకరణ చేసిందన్నది కూడా వెల్లడిచేస్తున్నాయి. ఇండియన్‌ క్రిస్టియన్‌ 306 , మొహమ్మడన్‌, 69, యారోపియన్‌, యారాసియాన్లు, 225 మంది. 1911నాటికి, ఈ ప్రెసిడెన్సీలో తమిళ బ్రాహ్మణుల్లో (పురుషులు) 22 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఇంగ్లీష్‌లో అక్షరాస్యత కలిగి వున్నారు. దీనికనుగుణమైన తెలుగు బ్రా హ్మణుల సంఖ్య 14.75, మలబార్‌లోని నాయర్లు సుమారు 3, బలిజనాయుడులు 2.6, వెల్లలులు 2 కంటే కొంచెం ఎ క్కువ వున్నారు. కమ్మ, నాడార్లు, రెడ్డీలలో ఇంగ్లీష్‌లో పురుష చదువరులు అరశాతానికి లోపు ఉన్నారు.
తమ మాతృభాషలో ఇంకా అనేక మంది అక్షరాస్యత సా ధించారు. తమిళ బ్రాహ్మణులలో 72 శాతం, తెలుగు బ్రాహ్మణులలో 68 శాతం, నాయర్లలో 42 శాతం, ఇండియన్‌ క్రిస్టియన్లలో 20 శాతం, నాడార్లలో 18 శాతం.
1914 మధ్య యూరప్‌లో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో, మద్రాస్‌లో జాతీయ వాదులు, బ్రాహ్మణ ఆధిపత్య వ్యతిరేకులు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ బ్రాహ్మణ ఆధిపత్య వ్యతిరేకులు సాధించినది చిన్నదైనప్పటికీ చెప్పుకోదగ్గ పురోగతి 1914లో బ్రాహ్మణేతర విద్యార్థులకు “ది ద్రవిడియ న్‌ హోం” తెరవడం. దీనికి ఆర్థిక వనరులు పానగంటి రామరాయనింగార్‌ (పానగల్‌ రాజా) సమకూర్చారు. ఆయనకు చెందిన భూములు, తెలుగు భూభాగం (మద్రాస్‌కు ఉత్తరాన)లో ఉన్నాయి. నగరంలోని వెల్లలా డాక్టర్‌ అయిన సి.నటేష్‌ ముదలియార్‌ ఈ హాస్టల్‌ను నిర్వహించేవారు.
స్వపరిపాలనకు డిమాండ్‌
ఐరిష్‌ స్త్రీ, అన్నీ బీసెంట్‌ (1847 1933) అపుడు ఇంగ్లాండ్‌లో గొడవల మధ్య ఉంటూ 1894లో భా రతదేశానికి వచ్చా రు. మద్రాస్‌ జాతీయ వాదులకు ఆమె నా యకత్వం వహించా రు. అక్కడ ఆమె దైవజ్ఞానం పొందడానికి ముందు తాను నాస్తికురాలినని ప్రకటించారు. వారణాసిలో కొంత సమయం వెచ్చించినప్పటికీ, ఆ మె రాజకీయ కేంద్రం మాత్రం మద్రాసే. అ క్కడ 1914 జూన్‌లో, ఒక వార్తా పత్రికను కొనుగోలు చేశారు. దాని పేరు ‘న్యూఇండియా’గా మార్చారు. ఈ పత్రిక ద్వారా ఆ మె భారతదేశానికి స్వపరిపాలన (హోంరూల్‌)ను డిమాండ్‌ చేశారు. ఆ వైఖరి, దానితో పాటు భారతదేశ పవిత్ర గ్రంథాల పట్ల తన ఆరాధనా భావా న్ని పదేపదే ప్రకటించడం, ఆకట్టుకునే వ్యక్తిత్వం, ఆమె వాగ్ధాటి ఆమెను అంత తేలికగా నిర్లక్ష్యం చేయలేని వ్యక్తిగా తీర్చిదిద్దాయి. మద్రాస్‌లోని బ్రిటిష్‌ వారు, వారు ప్రభుత్వోద్యో గులైనా పౌరులైనా అన్నీ బీసెంట్‌ను ఏహ్యభావంతో చూసేవారు. న్యూఇండియాకు సెక్యూరిటి కట్టాలని తరచూ డిమాండ్‌ చేసేవారు. అది ఆమె ప్రజాకర్షణకు తోడయ్యేది.
1916 సెప్టెంబర్‌ 3న హోంరూల్‌ లీగ్‌ను ప్రారంభించారు. జిల్లా కేంద్రాలు వెలిశాయి. బీసెంట్‌ అనుచరుడైన కాంగ్రెస్‌ నాయకుడు సేలం సమీపంలో ఉండే ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ పి వరదారాజులు నా యుడు హోంరూల్‌ గురించి తమిళంలో ప్రసంగం చేశారు. ఆయన తెలుగు మూ లాలున్న కుటుంబానికి చెందినవారు. దీనికి సమాంతరం గా, మరో వైపున కార్యక్రమాలు జరుగుతుండేవి. 1916 నవంబర్‌ 20న సుమారు 30 మంది ప్రముఖ బ్రాహ్మణేతరులు మద్రాసు విక్టోరియా పబ్లిక్‌ హాలులో సౌత్‌ఇండియన్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఐపిఏ)ను ఏర్పాటు చేసేందుకు సమావేశమయ్యారు. బాహ్మణేతరుల ఇబ్బందులను ఎలుగెత్తి చాటేందుకు ఇంగ్లీష్‌, తెలుగు, తమిళ వార్తా పత్రికలను ప్రచురించేందుకు ఒక జాయింట్‌ స్టాక్‌ కంపెనీని ఏర్పాటు చేశారు.
బ్రాహ్మణేతరుల మేనిఫెస్టో : ఒక నెల తరువాత, డిసెంబర్‌ 20న ది హిందూ, బీసెంట్‌ గారి ‘న్యూ ఇండియా’ పత్రికలు ఎస్‌ఐపిఏ ప్రచురించిన బాహ్మణేతర మేనిఫెస్టోను వాటి పాఠకులకు అం దించాయి. ఆ మేనిఫెస్టో “ఇండియన్‌ హోంరూల్‌ ఉద్యమాన్ని వ్యతిరేకించింది. మద్రాసు ప్రెసిడెన్సీపై అజమాయిషీ సంపాదించేందుకు బాహ్మణుల ప్రయత్నంగా దానిని చిత్రించింది. దక్షిణ భారత లిబరల్‌ ఫెడరేషన్‌ (ఎస్‌ఐఎల్‌ఎఫ్‌) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు కూడా అది ప్రకటించింది. దానిపై సంతకాలు చేసిన వారిలో తెలుగు, తమిళ, మళయాళీ, కన్నడ పేర్లు ఉన్నాయి. బ్రాహ్మణేతరులందరి తరపున వకాల్తా పుచ్చుకొన్నట్లు మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ ఎస్‌ఐఎల్‌ఎఫ్‌ ప్రప్రథమ లక్ష్య ం, మద్రాస్‌ ప్రెసిడెన్సీలో బ్రిటిష్‌ అధికారిక విధానాన్ని ప్రభావితం చేసేందుకు అనుచర గణాన్ని ఆకర్షించడం మాత్రం కా దు. దాని తక్షణ లక్ష్యం ప్రభుత్వ సర్వీసులలో, కాలేజీలలో బ్రాహ్మణేతరులకు మరిన్ని స్థానాలను సంపాదించడం.
ఎస్‌ఐపిఏ ఇంగ్లీష్‌ దినపత్రిక ‘జస్టిస్‌’ మొదటిసారిగా ఫిబ్రవరి 26,1917న బయటి కొచ్చింది. తమిళదినపత్రిక ‘ద్రవిడ న్‌’1917 మధ్యలో ప్రచురించబడింది.1885 నుండి ప్రచురితమవుతున్న తెలుగు ఆంధ్రప్రవేశికను స్వాధీనం చేసుకుంది.
ఎస్‌ఐఎల్‌ఎఫ్‌ త్వరలోనే జస్టిస్‌ పార్టీగా అందరికీ తెలియవచ్చింది. దాని సభ్యుల్లో చాలా మంది, ‘బ్రాహ్మణులు’, ‘ఆర్యులు’, ‘ఉత్తర భారతీయులు’ పర్యాయ పదాలయినట్లు ‘తమిళ్‌’, ‘ద్రవిడన్‌’ లేదా ‘ద్రవిడియన్‌’, ‘బ్రాహ్మణేతరులు ’, దక్షిణ భారతీయులు వంటి పదాలన్నీ పర్యాయ పదాలనే వైఖ రి తీసుకున్నారు. బ్రాహ్మణేతరులందరూ వారి పూర్వపు ఔ న్నత్యాన్ని గుర్తించేటట్లు చేయాలని, ఉత్తరాదినుండి దక్షిణాదిలోకి అక్రమంగా చొరబడిన అహంకారులైన బ్రాహ్మణులకు వారి స్థానం వారికి చూపించే విధంగా బ్రాహ్మణేతరులను చైతన్యపరచాలని వారు భావించారు.
బ్రాహ్మణులను, ఆర్యులను, కులవ్యవస్థను జస్టిస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ పార్టీ ఉన్నత తరగతులదిగానే వుం టూ వచ్చింది. అంతేగాక, దాని నాయకులు బహిరంగంగా కొట్లాడుకోవటం, వలస పాలకులు ఈ పార్టీని పొగడటం పార్టీకి ఇబ్బందికరంగా ఉండేది. అయినా ఎస్‌ఐఎల్‌ఎఫ్‌ను దక్షిణాదిన బ్రాహ్మణేతర రాజకీయ అధికారానికి పునాదిగా భవిష్యత్‌ గుర్తిస్తుంది.
భారతదేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వ విదేశాంగ మంత్రిగా ఉం టున్న ఎడ్విన్‌ మాంటేగూ 1917 ఆగస్టు 20న బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఒక నూతన విధానాన్ని ప్రకటించారు. పాలనా యంత్రాంగంలో ప్రతిశాఖలో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచటం, బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అంతర్గత భాగ ంగా భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని క్రమాను, గతంగా సాధించే దిశలో స్వయం పరిపాలక సంస్థలను అభివృద్ధి చేయటం ఆ విధానం.
మాంటేగూ ప్రకటనతో అనేక క్లెయిములు వెల్లువెత్తాయి. 1909లో ముస్లింలు ప్రత్యేక పరిగణన పొందారు కనుక, బ్రాహ్మణేతరులు (ప్రెసిడెన్సీ జనాభా 4.1 కోట్లలో నాలుగు కోట్ల మంది) కూడా అటువంటి పరిగణనే పొందాలనే క్లెయి ంను జస్టిస్‌ పార్టీ ముందుకు వచ్చింది.

[మోడరన్‌ సౌత్‌ ఇండియా : ఎ హిస్టరీ ఫ్రం ది 17th సెంచరి టు అవర్‌ టైమ్స్‌. రచన రాజామోహన్‌గాంధి,
అలెప్‌ ప్రచురణ. రూ. 799]
(ది హిందూ సౌజన్యంతో)

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments