హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కొందరికి భారీ మెజారిటీతో విజయం దక్కగా.. మరికొందరు తుది వరకూ పోరాడి ఉత్కంఠ పోరులో అత్యల్ప ఆధిక్యంతో గెలుపొందారు. సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్‌రావు లక్షకుపైగా మెజారిటీ సాధించి తన సత్తా చాటారు. ఇక్కడ హరీశ్‌కు మొత్తం 1,31,295 ఓట్లు పోలవగా.. రెండో స్థానంలో నిలిచిన టిజెఎస్ అభ్యర్థి భవానీరెడ్డికి కేవలం 12,596 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక అత్యల్పంగా ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు కేవలం 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి 65,617 ఓట్లు రాగా.. ఆత్రం సక్కుకు 65,788 ఓట్లు వచ్చాయి.
అత్యధిక మెజారిటీ సాధించిన వారి వివరాలు..
* హరీశ్‌రావు(టిఆర్ఎస్)-సిద్దిపేట-1,18,699 ఓట్ల మెజారిటీ
* ఆరూరి రమేశ్(టిఆర్ఎస్)-వర్ధన్నపేట-99,240
* కెటిఆర్ (టిఆర్ఎస్)-సిరిసిల్ల-89,009
* సిహెచ్. మల్లారెడ్డి(టిఆర్ఎస్)-మేడ్చల్-87,990
* ఎం.డి మోజమ్‌ఖాన్(ఎంఐఎం)-బహదూర్‌పుర-82,518
* అక్బరుద్దీన్ ఓవైసీ(ఎంఐఎం)-చాంద్రాయణగుట్ట-80,264
అత్యల్ప మెజారిటీ
* ఆత్రం సక్కు(కాంగ్రెస్)-ఆసిఫాబాద్-171 ఓట్ల మెజారిటీ
* మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(టిఆర్ఎస్)-ఇబ్రహీంపట్నం-376
* కొప్పుల ఈశ్వర్(టిఆర్ఎస్)-ధర్మపురి-441
* బొల్లం మల్లయ్య యాదవ్(టిఆర్ఎస్)-కొదాడ-756
* కాలేరు వెంకటేశ్ (టిఆర్ఎస్)-అంబర్‌పేట్-1016