రెండో వన్డేలో బంగ్లాపై విండీస్ ఘన విజయం
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యా చ్ల సిరీస్‌ను 1 సమం చేసింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కరీబియన్ జట్టుకు ఈ విజయం ఊరాట కలిగించింది. టె స్టు సిరీస్‌లో వైట్ వాష్ అయిన విండీస్, మొదటి వన్డేలో కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. విండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్ (146 నా టౌట్; 144 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) చిరస్మరాణీయ అజే య శతకంతో తమ జట్టును విజయపతంలో నిడిపించాడు. దీంతో విం డీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని దక్కించుకుం ది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఆరంభం కలిసి రాలేదు. ఓ పెనర్ లిటన్ దాస్ (8), ఇమ్రుల్ కైస్ (0) పరుగులకే వెనుదిరిగారు. త ర్వాత తమీమ్ ఇక్బాల్ (50; 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికుర్ రహీం (80 బంతుల్లో 5 ఫోర్లతో 62), సాకిబుల్ హసన్ (65; 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో బం గ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో థోమస్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ చంద్రపాల్ హేమ్రాజ్ (3) పరుగులకే పెవిలియన్ చేరడంతో విండీస్ 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం డారెన్ బ్రావోతో కలిసి మరో ఓపెనర్ షై హోప్ విండీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశా డు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించిన అనంతరం బ్రా వో (43 బంతుల్లో 27)ను రుబెల్ హుస్సెన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. త ర్వాత వచ్చిన మర్లొన్ శామ్యూల్స్ (26)తో కలిసి హోప్ మరో కీలక భా గస్వామ్యాన్ని ఏర్పరిచాడు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 పరుగులు జో డించిన అనంతరం శ్యాముల్స్ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో వెనుదిరిగా డు. తర్వాత పుంజుకున్న బంగ్లా బౌలర్లు విండీస్ బ్యాట్స్మన్లపై ఎ దు రుదాడికి దిగారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ విండీస్‌ను కట్టడి చే శారు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు హోప్ మాత్రం దూకుడు గా ఆడుతూ తమ జట్టును విజయం దిశలో పరిగెత్తించాడు. ఈ క్రమంలోనే హోప్ 118 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వా త విండీస్ 41.1 ఓవర్లలో 200 పరుగుల మైలురాయిని దాటింది. శతకం తర్వాత మరింతగా రెచ్చిపోయిన హోప్ బండరీల వర్షం కురిపిస్తూ వేగంగా పరుగులు చేశాడు. ముస్తాఫిజుర్ వేసిన 49వ ఓవర్లో అకాశమే హద్దుగా చెలరేగిపోయిన హోప్ ఈ ఓవర్లో ఏకంగా 16 పరుగులు రాబట్టుకున్నాడు. దీంతో చివరి ఓవర్లో విజయం కోసం కావలిసిన 6 పరుగులను హోప్ మరో రెండు బంతులు మిగిలుండగానే పూర్తి చేశాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన షైహోప్ 144 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 146 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో విండీస్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, రుబెల్ చెరో రెండు వికెట్లు తీశారు. హోప్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.