క్వార్టర్స్‌లో బెల్జియం, నెదర్లాండ్స్
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్, కెనడాల పోరాటం ముగిసింది. మరోవైపు క్రాస్ ఓవర్లో విజయాలు సాధించిన బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాయి. మంగళవారం ఇక్కడ జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో మూడో సీడ్ బెల్జియం 5 గోల్స్‌తో నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన బెల్జియం జట్టు పాకిస్థాన్ గోల్ పోస్టులపై వరుసదాడులు చేస్తూ హడలెత్తించింది. వీరి దాడిని తట్టుకోలేక పాకిస్థాన్ భారీ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నెదర్లాండ్స్ తరఫున 10వ నిమిషంలో హెండ్రిక్స్, 13వ నిమిషంలో థోమస్, 27వ నిమిషంలో చార్లియర్ కెర్డిక్, 35వ నిమిషంలో సెబస్టీయన్, 53వ నిమిషంలో బూన్ టామ్ వరుసగా గోల్స్ చేయడంతో బెల్జియం 5-0తో విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక క్వార్టర్ పోరులో బెల్జిజయం జర్మనీతో ఢీ కొననుంది. ఇక్కడ జరిగిన మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంక్ నెదర్లాండ్స్ 5- కెనడాపై ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నెదర్లాండ్స్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి ఏకపక్షంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుని క్వార్టర్స్‌లో దూసుకెళ్లింది. ఇక క్రాస్ ఓవర్ మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్ బెర్తులు ఖారారయ్యాయి.
క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు..
అర్జెంటీనా X ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (బుధవారం)
భారత్ X నెదర్లాండ్స్, బెల్జియం X జర్మనీ (గురువారం)
హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్, కెనడా ఔట్
RELATED ARTICLES