బాలాసోర్(ఒడిశా): న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లే అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు విజయవంతమయ్యాయి. సోమవారం ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిఆర్‌డిఎ శాస్త్రవేత్తలు అగ్ని-5 క్షిపణి పరీక్షలు నిర్వహించారు. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాలను చేధించేలా అగ్ని-5ని డిఆర్‌డివో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. అగ్ని-5.. 1.5 టన్నుల న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను మోసుకెళ్లేలా డిఆర్‌డిఎ దీన్ని రూపొందించింది. అగ్ని-5 మిసైల్ అగ్ని బాలిస్టిక్ క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైనది. ఇంతకు ముందు గల అగ్ని-1 క్షిపణి 700 కిలోమీటర్ల లక్ష్యాలను మాత్రమే చేధించేది. అలాగే అగ్ని-2 సామర్థ్యం 2 వేల కిలోమీటర్లు కాగా.. అగ్ని-3,అగ్ని-4… 2500 నుంచి 3500 కిలోమీటర్ల లక్ష్యాలనే అధిగమించేవి. ఇక ప్రస్తుతం డిఆర్‌డివో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అగ్ని-5 అగ్ని సిరీస్‌లోనే అత్యంత శక్తివంతమైంది. ఇప్పటికే అగ్ని-5ను డిఆర్‌డివో 6సార్లు పరీక్షించగా.. సోమవారం 7వ సారి ట్రయల్ పరీక్షలను నిర్వహించింది. అంతేకాక తొలిసారి అగ్ని-5 మిసైల్ పరీక్షను లాప్టెడ్ ట్రజెక్టర్ విధానంలో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ విధానంలో మిసైల్ భూవాతావరణం దాటి వెళ్లి తిరిగి భూవాతావరణంలోకి వచ్చి దాడులు చేయగల సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది.
అగ్ని-5 క్షిపణి పరీక్షలు విజయవంతం
RELATED ARTICLES