ప్రజాపక్షం / హైదరాబాద్ : సేవ్ కాన్‌స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనే నినాదంతో డిసెంబర్ 26న కోల్‌కతలో సిపిఐ భారీ ర్యాలీ నిర్వహిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. కేంద్రంలోని మోడి ప్రభుత్వం దేశంలో సెక్యులరిజం, డెమోక్రసిలను నాశనం చేస్తోందని, ఆ తర్వాత రా జ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి మనుస్మృతిని రు ద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సో మవారం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడా రు. రానున్న లోక సభ ఎన్నికలకు సెమిఫైనల్ అయిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమి చవిచూస్తోందన్నారు. 2019 లోకస భ ఎన్నికల్లో బిజెపి ఓటమి తప్పదని అందుకే ఆ పార్టీ మళ్ళీ ఆయోధ్య అంశాన్ని తెరపైకి తె చ్చిందని, చారిత్రాత్మక నగరాల పేర్లను మా రుస్తోందని దుయ్యబట్టారు. గత నాలుగున్నరేళ్లుగా నిద్రపోయిన బిజెపి ప్రభుత్వం అధికారం కోసం రామాలయ అంశంతో, హిందు త్వ పేరుతో ప్రజలను రెచ్చగొడ్తోందన్నారు. రాముడంటే బిజెపికి విశ్వాసం లేదని ఓట్ల కోసం రాముడ్ని అమ్మడానికి ఆ పార్టీ సిద్దమని ఆరోపించారు. 2019 ఎన్నికలు మోడి ప్రభుత్వానికి చివరి ఎన్నికలని అన్నారు. బిజెపిని ఓడించడం ద్వారా దేశాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలన్నీ నేడు సమావేశమయ్యాయని అన్నారు. ప్రమాదంలో పడిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం బిజెపి వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. వామపక్ష, ప్రజాస్వామ్య, సెక్యులర్ , ప్రోగ్రెసివ్, పార్టీలు, భావసారుప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలతో ఒక విశాల వేదికను ఏర్పాటు చేసి మతోన్మాద, కార్పోరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగానే సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి బిజెపి ఏతర అన్ని పార్టీలు పాల్గొంటున్నాయని, అందులో కెసిఆర్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పార్టీలు కూడా పాల్గొనాలని నారాయణ పిలుపునిచ్చారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం.. 26న కోల్‌కతలో సిపిఐ భారీ ర్యాలీ
RELATED ARTICLES