కార్టర్స్‌లో శ్రీలంకపై విజయం,
ఎమర్జింగ్ టీమ్స్ కప్ టోర్నమెంట్
కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్స్ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు సెమీ ప్రవేశించింది. సోమవారం ఇక్కడ ఆతిధ్య శ్రీలంకతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 4 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు భారత బౌలర్లు ఆరంభంలోనే ఎదురుదెబ్బ వేశారు. లంక స్కోరు 26 పరుగుల వద్దే ఓపెనర్ బొయగొడ (6)ను ప్రసిధ్ క్రిష్ణ ఔట్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్ వీరకోడి (22)ను జయంత్ యాదవ్ రెండో వికెట్‌గా పెవిలియన్ పంపాడు. తర్వాత షేహన్ జయసూర్య (42 బంతుల్లో 38 పరగులు)తో కలిసి అవిష్క ఫెర్నాండో శ్రీలంక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించిన అనంతరం జయసూర్య ఔటయ్యాడు. తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫెర్నాండో (106 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 80 పరుగులు చేసి శివం మావీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివర్లో లంక కెప్టెన్ శమ్ము అషన్ (67నాటౌట్; 64 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో చెలరేగడంతో శ్రీలంక ఎమర్జింగ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బౌలర్లో శివం మావీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిధ్ క్రిష్ణ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ ఎమర్జింగ్ జట్టులో ఆదిత్య తారే (0), నితిష్ రానా (13) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. అనంతరం గైక్వాడ్, హిమ్మత్ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పరిచి భారత్‌ను ఆదుకున్నారు. అనంతరం గైక్వాడ్ (67; 73 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అంబుల్‌దెనియ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన దీపక్ హూడా (26) పరుగులు చేసి ఔటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు హిమ్మత్ సింగ్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ శతకం పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు అజేయంగా క్రీజులో నిలబడటంతో భారత జట్టు 47.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన హిమ్మత్ సింగ్ 140 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ మరో 15 బంతులు మిగిలుండగానే గెలుపొందింది.
సెమీఫైనల్లో భారత్
RELATED ARTICLES