ఆడిలైడ్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 21 ఏళ్ల పంత్ అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్రపంచ రికార్డును సమం చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం11 క్యాచ్‌లు పట్టిన పంత్ ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ల జాబితాలో చేరాడు. మరోవైపు భారత్ తరఫున ఒక టెస్టులో అత్యధిక(11) క్యాచ్‌లు అందుకున్న మొదటి వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. అంతకుముందు వృద్ధిమాన్ సాహా పేరిట ఉన్న (10) క్యాచ్‌ల రికార్డును తాజాగా పంత్ చెరిపేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు అందుకున్న పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టి మొత్తం 11 క్యాచ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో క్యాచ్ పట్టి ఉంటే కొత్త చిరిత్ర సృష్టించేవాడు. పంత్ తన కెరీర్ తొలి దశలోనే ఈ ఘనతను సాధించడం గమనార్హం. ఇక ప్రపంచ క్రికెట్ ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక (11) క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ల జాబితాలో ఎబి. డివిలియర్స్ (సౌతాఫ్రికా), జాక్ రస్సెల్ (ఇంగ్లాండ్ ) సరసన చేరాడు. మరోవైపు ఈ టెస్టు మ్యాచ్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఆడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (35) మంది క్యాచ్‌ల రూపంలో పెవిలియన్ చేరారు. దీంతో ఒక టెస్టులో అత్యధిక 35 క్యాచ్‌ల రికార్డు కూడా ఈ మ్యాచ్‌లో నమోదైంది. అంతకుముందు సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టులో (34) క్యాచ్‌లు నమోదయ్యాయి. తాజాగా, ఆడిలైడ్ టెస్టు ఆ రికార్డును అధిగమించింది.
అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్లు:
రిషభ్ పంత్ (11 క్యాచ్‌లు) ఆస్ట్రేలియాపై (2018)
ఎబి డివిలియర్స్ (11 క్యాచ్‌లు) పాకిస్థాన్‌పై (2013)
జాక్ రస్సెల్ (11 క్యాచ్‌లు) సౌతాఫ్రికాపై (1995)
ప్రపంచ రికార్డును సమం చేసిన పంత్
RELATED ARTICLES