31 పరుగులతో ఆసీస్‌పై ఘన విజయం, సిరీస్‌లో 1-0 ఆధిక్యం
ఆడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఆడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ 31 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడించి టోర్నీలో బోణీ కొట్టింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. అంతేకాకుండా కోహ్లీసేన మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఆరంభపు టెస్టులో మొదటి సారిగా విజయాన్ని అందుకుని కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఎన్నో పర్యటనలు చేసిన టీమిండియా తొలి సారిగా మొదటి టెస్టులో విజయం సాధించింది. 323 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 291 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 31 పరుగుల విజయం దక్కింది. అయితే ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనా.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు మాత్రం అద్భుతమైన పోరాటం చేసి ఆకట్టుకున్నారు. చివరి వరకు పోరాడి అందరి ప్రశంసలు పొందారు. మరోవైపు ఈ విజయం కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరికి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బ్యాటింగ్‌లో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే రాణించి భారత్‌కు పోరాడగలిగే స్కోరును అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో (123), రెండో ఇన్నింగ్స్‌లో (71) పరుగులు చేసిన పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తొలి టెస్టులో భారత్ జయకేతనం
RELATED ARTICLES