ఆర్మీ కమాండర్ రణబీర్ సింగ్
కపుర్తల : ఈ ఏడాది ఇప్పటి వరకు జ మ్మూకశ్మీర్‌లో 225మందికి పై గా ఉగ్రవాదులు హతమైన ట్లు ఉతర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ శనివా రం పేర్కొన్నా రు. పంజాబ్ క పుర్తా పూర్‌లో ని సైనిక్ స్కూ ల్‌లో పర్యటించిన రణ్‌బీర్ విలేకరులతో మాట్లాడా రు. ప్రభుత్వం, భద్ర తా దళాలు తీసుకున్న చర్యల వల్ల గత కొన్ని నెలల నుంచి ఉగ్రవాదులుగా మారుతున్న, ఆ బాట పడు తున్న అనేక మంది యువకుల సంఖ్య తగ్గుతోందన్నారు. తాము పెద్ద మొత్తంలో ఉగ్రవాదులను మ ట్టుబెట్టామని, ఇ ప్పటి వరకు 225 మందికిపైగా ముష్కరులను హ తం చేశామని చెప్పారు. అ యితే ఈ ఏడాది ముగిసేందుకు ఇంకొన్ని రోజులు మిగిలి ఉన్నాయ న్నారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని స్థానికులు సైనికులతో పంచుకున్నారని, ఇది శుభ పరిణామమని తెలిపారు. తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న పాకిస్థాన్ జమ్మూ కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపుతోందన్నారు.
అయితే ఉగ్రవాదులను కట్టడి చేయడంలో ఏమా త్రం వెనక్కి తగ్గేది లేదని, వారు వస్తు న్నా కొద్దీ ముట్టుబెడుతూనే ఉంటామని రణబీర్ స్ప ష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో శాంతి, స్థిరత్వాన్ని కలగజేస్తామన్నారు. కశ్మీర్‌లో ప్రభుత్వం, భద్రతా దళాలు తీసుకున్న చర్యల వల్ల ఉగ్రవాదం వైపు మళ్లే యువకలు సంఖ్య తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని భారత్‌లోకి వ్యాపింపజేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అయితే ఉగ్రవాదాన్ని అడ్డుకునేం దుకు ఆర్మీ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ ఏడాది కశ్మీర్‌లో 225 మంది ఉగ్రవాదులు హతం
RELATED ARTICLES