13 మంది దుర్మరణం, 17 మందికి గాయాలు
జమ్ము: జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం వాటిల్లింది. శనివారం పూంచ్ జిల్లాలో 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి పల్టీలు కొ డుతూ లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటన లో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మం దికి గాయాలయ్యాయి. బస్సు లోరన్ నుంచి పూంచ్ కు వెళ్తుండగా మండి ప్రాంతం ప్లేరాలో మూల మ లు పు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ వంది మీటర్ల లోతు ఉన్న లోయలోకి జారిపడిందని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తీవ్ర గాయాలైన ఐ దుగురిని ఘ టనాస్థలి నుంచి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని, ఇం కో ఇద్దరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ట్లు ఆ అధికారి పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమి త్తం వారిని హె లికాప్టర్ ద్వారా జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించారన్నారు. కాగా, ఘటనపట్ల జ మ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విచారం వ్యక్తం చేశా రు. మృతుల పట్ల సంతాపాన్ని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మాలిక్ ఒక సందేశంలో పేర్కొన్నారు. అదే విధంగ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాల ని కాంక్షించారు. ఇదిలా ఉండగా పర్వత ప్రాంతాల్లో తరు చూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూ అనేక మంది ప్రాణాలు కో ల్పోతుండడంపై దర్యాప్తు జరపాలని జమ్మూకశ్మీర్ పిసిసి డిమాండ్ చేసింది. పాత వాహనాల పరిస్థితిని తనిఖీ చేసేందు కు ప్రత్యేక అధికార బృందాన్ని ఏర్పాటు చేయాలని జెకెపిసిసి ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.