మిఛెల్లే స్టార్: అరుదైన డంబో ఆక్టోపస్‌ను అమెరికా తీర ప్రాంత సముద్ర జలాల్లో కనుగొన్నారు. సముద్ర గర్భంలో ఈ డంబో ఆక్టోపస్ జలచరాన్ని చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సో షల్ నెటవర్కింగ్ సైట్లలోని సైంటిస్ట్‌ల గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్నది. కాలిఫోర్నియా తీర ప్రాం తంలో పసిఫిక్ మహాసముద్రం గర్భంలో మెరైన్ సైంటిస్టులు అనుకోకుండా చిక్కిన ఈ డంబో ఆక్టోపస్‌ను చిత్రీకరించారు. అచ్చం తిమింగళం తరహాలోనే వున్న ఈ ఆక్టోపస్ అద్భుతంగా వుం ది. ఈ ఆక్టోపస్ సముద్రంలో ఏ ప్రాంతం నుంచి వచ్చిందో గుర్తించలేకపోయామని, కాసేపటిలోనే ఇది సముద్ర గర్భంలో మాయమైందని వారు చెప్పారు. ఇ/వి న్యూటిలస్‌కు చెందిన మెరైన్ బృందం ఆర్‌ఓవి (రిమూట్‌లీ ఆపరేటెడ్ అండర్‌వాటర్ వెహికల్స్) హెర్క్యులస్ అనే రోవర్ల ద్వారా ఈ ఆక్టోపస్‌ను కనిపెట్టారు. ఇప్పటివరకు ఈ తరహా వింత ఆక్టోపస్ గురించి తెలియదని, తొలిసారిగా దీన్ని గుర్తించినట్లు ఈ పరిశోధకులు తెలిపారు. మాంటెరీ బే నేషనల్ మెరైన్ శాంక్చువరీలోని అగ్నిపర్వతం డేవిడ్సన్ సీమౌంట్ సర్వేలో భాగంగా ఈ సాహస కార్యం చేపట్టారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వెంటనే ‘ఓ మై గాడ్. మా చిన్న డంబో’, ‘డంబో’, ‘ఓ మై గోష్’, ‘సో కూల్’, ‘ఊ…’ వంటి సందేశాలను పోస్ట్ చేశారు. రోవ్ హెర్క్యులస్ హై రిజల్యూషన్ కెమెరాతో ఈ వీడియోను చిత్రీకరించారు. దాదాపు 60 సెంటీమీటర్ల పొడవు వుంది. సహజంగా ఆక్టోపస్‌లు 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు వుంటాయి. స ముద్ర ఉపరితలం నుంచి 3.2 కిలోమీటర్ల లోతు లో ఈ వింత ఆక్టోపస్‌ను గుర్తించినట్లు చెప్పారు.