లండన్: అత్యంత పురాతనమైన నక్షత్రాన్ని ఖగోళశాస్త్రవేత్తలు కనుగొన్నా రు. ఈ నక్షత్రం ఈనాటిది కాదు. బిగ్‌బ్యాంగ్ సంభవించినప్పుడు ఏర్పడిన పురాతన నక్షత్రమిది. బిగ్‌బ్యాంగ్ వల్ల ఏర్పడిన అంతరిక్ష పదార్థాలతో ఏర్పడిన విశ్వంలోసిన అత్యంత పురాతన నక్షత్రాల్లో ఒకదాన్ని కనిపెట్టారు. మన సౌర వ్యవస్థ నివాసమున్న పాలపుంత రోదసీలోని ఒక భాగంలో ఈ నక్షత్రం కన్పించింది. ఈ నక్షత్రం 13.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది పూర్తిగా తక్కువ మెటల్ కంటెంట్ వున్నట్లుగా జిన్‌హువా వార్తాసంస్థ తెలిపారు. విశ్వంలో ఏర్పడిన తొలి తరం నక్షత్రాలు ఇంతవరకు ఉనికిలో వుండటం ఒక విధంగా సాధ్యంకాదని, కానీ ఈ వృద్ధ నక్షత్రం ఇంకా వుండటం గొప్ప విషయమని దీనిపై అధ్యయనం నిర్వహించిన ప్రధాన శాస్త్రవేత్త ఆండ్రూ కేసీ తెలిపారు.