శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ క్లబ్లో పలువురు సినీ ప్రముఖులతో పోలింగ్ కేంద్రాలు కలకల లాడాయి. అయితే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీనటులు, ప్రముఖులు రాకతో జూబ్లీహిల్స్‌లో పరిసర ప్రాంతాల్లో వారిని కలిసేందుకు అక్కడి ఓటర్లు ఆసక్తి చూపారు. సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, జూనియర్ ఎన్టిఆర్, సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్, అక్కినేని నాగార్జున తన సతీమణి అమలతో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీనటుడు మహేష్‌బాబు, రాంచరన్ భార్య ఉపాసన, అల్లు అరవింద్, జగపతిబాబు, రాణా తదితరులు ఉన్నారు.