న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్లు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రిజర్వేషన్లు 50శాతానికి కంటే మించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శుక్రవారం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో వాదనలు జరిగాయి. తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలని కోరింది. కాగా రిజర్వేషన్లు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
RELATED ARTICLES