వెస్ట్ ల్యాండ్‌పై మైఖేల్ జేమ్స్ అన్ని విషయాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై మోడీ విమర్శల దాడి
సుమేర్పూర్/దౌస(రాజస్థాన్): యుపిఎ హయాంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించిన నిజాలు బయట పడుతుండడం తో.. కాంగ్రెస్ నాయకత్వానికి వణుకు మొదలైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. బుధవారం రాజస్థాన్ చివరి రోజు ఎన్నికల నేపథ్యంలో సుమేర్పూర్, దౌసలలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడు తూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ ఆదాయాల మదింపుకు సంబంధించిన కేసును పునర్ విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఛాయ్‌వాలా యొక్క ధైర్యానికి ప్రతీకని పేర్కొన్నా రు. యుపిఎ హయాంలో జరిగిన రూ. 3,600 కోట్ల అగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్‌కు సంబంధించిన నిజాలను బయట పెట్టేందుకు మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ సుముఖంగా ఉండడం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు. మైఖేల్‌ను దుబాయి ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకత్వంలో వణుకు మొదలైందన్నారు. నాలుగు తరాలుగా గాంధీ కుటుంబం అధికారాన్ని అనుభవించిందని, కానీ, సుప్రీంకోర్టు మంగళవారం సామాన్యుడికి విజయం చేకూర్చేలా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ల ఆదాయ మదింపుకు సంబంధించి కేసు పునర్ విచారణ చేసేందుకు ఐటి శాఖకు సుప్రీంకోర్టు అనుమతినివ్వడం హర్షించదగిన విషయమన్నారు. ప్రస్తుతం ఛాయ్‌వాలా యొక్క పట్టుదల నుంచి ఎలా తప్పించుకుంటారో చూస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తికమక పార్టీగా మారిందని.. ఇందుకు కారణం ఆ పార్టీ అగ్రనాయకత్వం యొ క్క అస్తవ్యస్థమైన నిర్ణయాలే కారణమని విమర్శించారు. కాంగ్రెస్ అధినేతకు భాషపై కనీస అవగాహన లేదని… రాజస్థాన్‌లోని కుంభరన్ ప్రాజెక్టుకు కుంభకరన్ పేరుకు తేడా తెలియడం లేదన్నారు. ఇలాంటీ తికమక నాయకత్వం…ప్రజలు, దేశానికి మంచి చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గాజే.. బాజే కంపెనీ లాంటిదని.. ఆపార్టీని బిజెపి రాజస్థాన్‌లో చిత్తు చేస్తుందని తెలిపారు. ఆ పార్టీ రాజస్థాన్‌లో ఓడిపోయిన అది కాం గ్రెస్ రెబెల్స్ కారణంగా ఓటమి చెందామని తప్పించుకుంటుందని పేర్కొన్నారు. తరతరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న గాంధీ కుటుంబీకులు ట్రైబల్స్ సమస్యలపై మా ట్లాడడం విడ్డూరంగా ఉందని… వారికి ట్రైబల్ సమస్యల గురించి అసలు తెలియదన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వానికి భజన చేసే వారికే కాంగ్రెస్ అగ్రనాయకత్వం పెద్దపీటవేస్తుందని.. కానీ, అలాంటీ భజనపరులైన నాయకులకు క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన లేదన్నారు. రాజస్థాన్‌లోని దౌస ఖాదీకి చాలా సుప్రసిద్ధమైందని.. ఇక కాంగ్రెస్ నాయకత్వం కూడా మహాత్మ గాంధీ ఇష్టపడే ఖాదీయే తమ కలగా చెప్పుకుంటుందని.. అయితే మహాత్మ గాంధీ ఖాదీ ఎంతో ఇష్టపడ్డ… నకిలీ గాంధీ కుటుంబం మాత్రం ఆయన లక్ష్యాన్ని ఎప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు. ఎడారి రాష్ట్రంలో తిరిగి బిజెపి అధికారంలో వస్తుందని.. క్షేత్ర స్థాయి నాయకులే తమ పార్టీ విజయానికి తోడ్పాడును అందిస్తారని మోడీ ధీమా వ్యక్తం చేశారు.