బికనేర్ ల్యాండ్ కేసుపై రాబర్ట్ వాద్రా ఆరోపణ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాజస్థాన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొ నే మనీ ల్యాండరింగ్ కేసులో మరోసారి నోటీసులను పంపించిందని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఆరోపించారు. ప్రభుత్వ విభాగాల వ్యవహార శైలి చూ స్తుంటే తన కీర్తిని దెబ్బతిసేందుకు రాజకీయ మంత్రగత్తెల ఎజెండా పెట్టుకొని పనిచేసిన ట్లు అనిపిస్తోందన్నారు. బుధవారం ఆయన ఇడి నోటిషులపై స్పందిస్తూ.. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును పెట్టారు. ఈ సందర్భం గా వాద్రా దర్యాప్తు సంస్థపై విరుచుకుపడ్డా రు. రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ ఉన్న సమయంలోనే నోటీసులు పంపించి ఇబ్బందుల కు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇడి తమను ఇలాగే ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. తనకు సంబంధించిన మనీ ల్యాం డరింగ్ కేసులో ఇప్పటికే అన్ని రకాల పత్రాలను దర్యాప్తు సంస్థకు అందించినట్లు తెలిపారు. అయితే అధికారుల తీరు ప్రజల ఆలోచన విధానాన్ని మార్చి మీడియా సర్కార్‌ను సృష్టించేలా ఉందని ఆరోపించారు. కేసులో అంత ప్రాధాన్యత లేకున్న అధికారులు రాజకీయ ఒత్తిడి కారణంగానే తనపై విచారణ కొ నసాగిస్తున్నారని తెలిపారు. ఇక 2015లో కేంద్ర దర్యాప్తు సంస్థ వాద్రాకు సంబంధించి న బికనేర్ భూకేటాయింపుల విషయంలో క్రి మినల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో వాద్రా విచారణను ఎదుర్కోంటున్నారు.
రాజకీయ ఒత్తిళ్లతోనే నాపై విచారణ చేస్తున్నారు
RELATED ARTICLES