తమిళనాడు ప్రజలంతా అమ్మ అని పిలుకునే నాయకురాలు (తలైవి), రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న పవర్‌ఫుల్ విమెన్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినామాలో టైటిల్ పాత్ర పోషిచేందుకు విలక్షణ నటి, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నిత్యామీనన్‌ను ఎంపిక చేశారు. కాగా ఈ చిత్రానికి ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పేపర్‌టేల్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే, ఈ రోజు జయలలిత వర్థంతిని పురస్కరించుకుని చిత్రబృందం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లుక్‌లో నిత్యామేనన్ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. అచ్చం ఆమెలాగే కన్పిస్తున్నారు. జయలలిత రాజకీయ, సినీ జీవితాల్లోని ముఖ్య ఘట్టాలన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాయని చిత్రబృందం తెలిపింది. కన్నడలో ‘శ్రీశైల మహత్మ్యం’ అనే చిత్రం ద్వారా బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జయ దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. 2016లో అనారోగ్యంతో జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.