వికారాబాద్: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో వికారాబాద్ ఎస్పి అన్నపూర్ణపై ఎన్నికల సంఘం వేటు వేసింది. అన్నపూర్ణను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2005 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి అవినాశ్ మహంతిని వికారాబాద్ ఎస్పిగా నియమించింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. అన్నపూర్ణకు ఎన్నికలతో సంబంధం లేని బాధ్యతలను అప్పగిస్తూ ఇసి ఉత్తర్వులు జారీచేసింది. కొడంగల్‌లోని రేవంత్ నివాసంలో మంగళవారం వేకువజామన పోలీసులు చొరబడి అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక తెప్పించుకున్న ఇసి.. ఈ మేరకు చర్యలు చేపట్టింది. అన్నపూర్ణను బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
వికారాబాద్ ఎస్పిపై వేటు
RELATED ARTICLES