మధ్నాహ్న భోజన పథకంలో విఫలమైనందుకు
న్యూఢిల్లీ: పాఠాశాలల్లో మధ్యా హ్న భోజన పథకాన్ని సీరియస్గా తీసుకోనందుకు ఢిల్లీ, ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మంగళవారం జరిమానా విధించింది. ప్రభు త్వ పాఠాశాలల్లో మధ్యా హ్న భోజన పథకం అమ లు, ఆరోగ్యం గురించిన చా ర్ట్ సహా ఆన్లైన్ అనుసంధా నం విషయంలో విఫలమైనందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్మూకశ్మీర్ రూ. 1లక్ష చొప్పున చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి మదన్ బి లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనం భోజన పథకం అమలుకు సంబంధించిన కావలసిన వివరాలు ఇవ్వనందుకు రూ. 2 లక్షల జరిమానాను ఢిల్లీకి విధించింది. నాలుగు వారాల్లో సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీకి ఆ మొత్తాన్ని జమా చేయాలని న్యాయమూర్తులు దీపక్ గు ప్తా, హేమంత్ గుప్తాలు కూడా ఉన్న ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉండగా తదుపరి విచారణను నాలుగు వారాలకు ధర్మాసనం వాయిదా వే సింది. మధ్నాహ్న భోజన పథకంపై 2013లో ‘అంతర్రాష్ట్రీయ మానవ్ అధికార్ నిగ్రానీ పరిషత్’ అనే ఎన్జిఒ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. దేశవ్యాప్తంగా 12 లక్షల ప్రభుత్వ పాఠాశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో బాలలు ఉచిత ఆహారం ప్రతి రోజు పొందుతున్నారని, కానీ సరైన మౌలికవసతి, పర్యవేక్షణ లేకపోవడంతో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యే అవకాశం ఉంది’ అని తన పిటిషన్లో ఆ సంస్థ పేర్కొంది.