లక్నో: ఒకవైపు 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరోవైపు డిసెంబర్ 6న అయోధ్యలో బాబరీ మసీదు కూల్చివేత వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు హిందూ సంస్థలు సన్నద్ధం అవుతున్నాయి. దీంతో అయోధ్య కాస్త రాజకీయ కేంద్రంగా మారబోతున్నది. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ విశ్వహిందూ పరిషత్(విహెచ్పి) ‘ధర్మ సభ’ను నిర్వహించింది. ఇప్పుడేమే డిసెంబర్ 6న ‘శౌర్య దివస్’, డిసెంబర్ 18న ‘గీత జయంతి ఉత్సవాలు’ నిర్వహించబోతున్నారు. హిందువులకు ‘భగవద్గీత’ ప్రకటితమైన పవిత్ర రోజుగా ఈ ‘గీత జయంతి’ని నిర్వహించబోతున్నారు. 2018 బాబరీ మసీదును కూల్చిన 26వ సంవత్సరం కానున్నది. అయోధ్యలో ఈ నెల అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.