మీట్ ది ప్రెస్‌లో సిఇఒ రజత్ కుమార్
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ అన్నారు. ఈ నెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశామన్నా రు. సోమవారం హైదరాబాద్ ప్రె స్ క్లబ్ ఆధ్వర్యంలోరజత్ కుమార్‌తో “ మీట్ ది ప్రెస్” కార్యక్రమం నిర్వహించారు. 119 అసెంబ్లీ ని యోజక వర్గాల్లో మొత్తం 1821 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారని, వీటిలో అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజక వర్గంలో 42 అభ్యర్ధులు, బాన్సువాడలో అతి తక్కువగా ఆరుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు ఉండగా , వీరిలో 1,41,56,182 మంది పురుషులు, 1,39,05,811 మంది మహిళలు, 2,691 మంది ఇతరులు ఉన్నారన్నారు. ప్రతి వెయ్యి మందికి పురుష ఓటర్ల నిష్పత్తి 982 మంది ఉండగా , మహిళా ఓటర్ల సంఖ్య 738 ఉందన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజక వర్గంగా శేరిలింగంపల్లి 5,75,541, అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజక వర్గంగా భద్రాద్రి కొత్తగూ డెం నియోజక వర్గం 1,37,319 ఉందన్నారు. మహిళల ఓట్లు కూడా శేరిలింగంపల్లిలోనే అత్యధికంగా 3,07,348 ఓటర్లు ఉండగా, అతి తక్కువ మహిళా ఓటర్ల సంఖ్య భద్రాద్రి కొత్తగూడెంలోనే 66,604 ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా సిసి టివీల నిఘా ఉంచుతున్నామన్నారు. ఈవిఎంలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. తాము వేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునేలా వివి ప్యాట్లను కూడా ఈ సారి ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్‌కు 55,329 బ్యాలెట్ యూనిట్లు, 39,763 కంట్రోల్ యూనిట్లు, 42,751 వివి ప్యాట్స్‌ను సిద్ధం చేశామని సిఇఓ రజత్ కుమార్ వెల్లడించారు. ఇవిఎం, వివిప్యాట్‌లు సక్రమంగానే పని చేస్తున్నాయని, సమస్యలు ఉత్పన్నం అయితే తక్షణమే వాటిని సరి చేసేందుకు 238 భెల్ ఇంజనీర్‌లను 31 జిల్లాల్లో సిద్ధ్ఢంగా ఉంచామన్నారు. రాజకీయ పార్టీలు డబ్బుపంపిణీ, పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శనపై సివిజిల్ యాప్‌కు ఇప్పటి వరకు ఓటర్లు 6858 ఫిర్యాదులు చేయగా అందులో 4967 కేసులపై స్పందించినట్లు రజత్‌కుమార్ వెల్లడించారు. సి విజిల్ యాప్‌లో ఓటర్లు ఏవైనా ఫిర్యాదులు చేస్తే పోస్ట్ చేసిన అరగంటలోనే జిల్లా ఎన్నికల అధికారి స్పందిస్తారన్నారు. పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శనపై ఎక్కువగా 3155 కేసులు, ఓటర్లకు డబ్బు, మద్యం ఎరపై 206 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఎన్నికలకు అంతా సిద్ధం చేశాం
RELATED ARTICLES