ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు వీరప్పమొయిలి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జవహర్‌లాల్ హాయం నుండి మన్మోహన్ సింగ్ వరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్, ఫ్లుఓవర్లు, రింగ్ రోడ్డులను కాంగ్రెస్ నిర్మించిందని, ఐటి ఇండస్ట్రీ, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలను ఏర్పాటు చేసిందని, నీటిపారుదల ప్రాజెక్టులకు రూపొందించిదని టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కూడా హైదరాబాద్‌కు రాలేదని అన్నారు. ఆనాడు కర్పాటక, హైదరాబాద్ మధ్య అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ ఉండేదన్నారు. శ్రీకృష్ణ కమిటి వేసి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని తెలిపారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అని తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. జమ్ముకశ్మీర్, మిజోరంలలో త్యాగాలు చేసిన కాంగ్రెస్ తెలంగాణ ఆంద్రప్రదేశ్‌లలో అధికారాన్ని త్యాగం చేసి ప్రజల ఆకాంక్షలకనుగుణంగా రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్‌ఎస్ పాలనలో దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాపులు, మహిళలపై వేధింపులు, రేప్ కేసులు పెరిగిపోయాయని, రైతుల ఆత్మహత్యల్లో, అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంటే నిరుద్యోగంలో మూడో స్థానంలో ఉందని, 75 శాతం కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయని విమర్శించారు. టిఆర్‌ఎస్ గుర్తు అయిన అంబాసిడర్ కారు కనుమరుగైందని, తెలంగాణ పాలన కెసిఆర్ కుటుంబ పాలన అయ్యిందని దుయ్యబట్టారు. 17 వేల కోట్ల మిగులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కెసిఆర్‌కు అప్పగిస్తే 2 లక్షల కోట్లు అప్పులు చేశాడని విమర్శించారు. జిఎస్‌టి వల్ల ఎంఎస్‌ఎంలకు నష్టం జరుగుతుందని తెలిసినా టిఆర్‌ఎస్ మద్దతునిచ్చిందని, యూపిఎ హాయంలో తగ్గిన పేదరికం ఇప్పుడు మళ్ళీ పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రవేశపట్టిన .జిఎస్‌టి బిల్లుకు బిజెపి బిల్లుకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్‌టి రిజర్వేషన్లను పెంచుతుందని మొయిలి తెలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే
RELATED ARTICLES