తెలంగాణ ప్రజలు మరోసారి ఆయనకు ఇవ్వరు : సిబల్
ప్రజాపక్షం / హైదరాబాద్ : అన్ని వర్గా ల ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలు మరో అవకాశం ఇవ్వరని అన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సిబల్ మాట్లాడుతూ ఫాంహౌస్ నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్న దేశంలోనే ఏకైక ము ఖ్యమంత్రి కెసిఆర్ అని ఎద్దేవాచేశారు. టిఆర్ఎస్ నాలుగున్నరేళ్ళ పాలనలో రైతులు, మహిళలు, యువత, అమరవీరుల కుటుంబాలు ఏవర్గాన్ని తీసుకున్నా ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని అయితే తాను ఉండడానికి మాత్రం రూ.300 కో ట్లతో ఇల్లు కట్టుకున్నాడని విమర్శించారు. పిల్లల చదువులకు ప్రాముఖ్యత ఇవ్వని సిఎం రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 4 వేలకు పైగా స్కూళ్లను మూసివేశారని, 16 వేల స్కూళ్లలో నీటి సౌకర్యం లేదని, 16 వందల స్కూ ళ్లకు విద్యుత్ సౌకర్యం లేదని, దాదాపు 14 వందల స్కూళ్లలో ఉపాధ్యాయులు లేరన్నారు. స్కిల్స్ విషయంలోనూ ప్రాముఖ్య త ఇవ్వడంలేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాల హామీ నేరవేర్చలేదని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని అన్నారు. రైతు రుణమాఫీ చేసినా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పు కు వడ్డీలు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలిందని ఆ యన తెలిపారు. రైతుల్లో 75 శాతం మంది ప్రైవేటు ఫైనాన్సర్ల నుంచి అప్పు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సిలకు మూడెకరాల భూ పంపి ణీ, దళిత ముఖ్యమంత్రి హామీ, అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఉద్యోగం, మూడెకరాల భూమి, జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ, నియోజకవర్గానికొక 100 పడకల ఆసుపత్రి, హామీలేమయ్యాయని సిబల్ ప్ర శ్నించారు. రాష్ట్రంలో 19 లక్షల మంది నిరుద్యోగులన్నారని వారికి ఉద్యోగవకాశాలు కల్పించబడడం లేదని, కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వలేక పోయారని, కాళేశ్వరం రిడిజైనింగ్ పేరుతో నిర్మాణ అంచనా వ్యయాన్ని 80 వేల కోట్ల కు పెంచారని విమర్శించారు. కెసిఆర్ మానసిక పరిస్థితికి ప్ర జలు రీడిజైనింగ్ చేయబోతున్నారని అన్నారు. బిజెపికి సహకరిస్తున్న కెసిఆర్‌ను లోకసభలో బిజెపిని వ్యతిరేకించే పార్టీ ఇక్క డ మద్దతిస్తోందని ఎంఐఎంనుద్దేశించి అన్నారు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ల హామి, 90% మైనారిటీ వి ద్యాసంస్థలు మూతపడడంపై వారెందుకు కెసిఆర్‌ను ప్రశ్నించరని కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపి ఓట్లు చీల్చిన ఆ పార్టీ బిజెపికి పరోక్షంగా సహకరించిందని, తెలంగాణ ఎన్నికల్లో మాత్రం జిల్లాల్లో అభ్యర్థులను ఎందుకు నిలపలేదని ప్రశ్నించారు. చంద్రశేఖర్‌కు హఠా వో, ప్రదేశ్‌కు బచావో అని ప్రజలకు పిలుపునిచ్చారు.