ప్రజాపక్షం/హుస్నాబాద్ : కెసిఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజాఫ్రంట్ నేతలు అ న్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ప్రజాఫ్రంట్ తరుపున పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కానుకగా ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. కెసిఆర్ అప్రజాస్వామిక గడీ పాలనను అంతమొందించేందుకు ప్రతిఒక్క సీటు కీలకమని, అం దరు సమష్టిగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్‌లో ఆదివారం కాంగ్రెస్ నా యకులు, మాజీ ఎంఎల్‌ఏ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన చాడ వెంకట్‌రెడ్డికి మద్దతుగా భారీ బహిరంగ సభ జరిగింది. కెసిఆర్ ఆశీర్వాద సభల కన్నా అధికంగా పెద్దసంఖ్యలో జనం హాజరుకావ డంతో ఈ బహిరంగసభకు ప్రాధాన్యతన సంతరించుకు న్నది. సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి, ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కటకం మృత్యుంజయం, జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు కన్హయ్య కుమార్, కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరామ్, తదితరులు ప్రసంగించారు. నియోజకవర్గం నుండి ఊహించని రీతిలో వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఎన్నికల ప్రచారం ఇక్కడి నుండే ప్రారంభమైంది. ఆ సంఖ్య కంటే రెండింతల జనం వచ్చారని స్థానికులు వ్యాఖ్యానించారు. అన్నిటికి మించి అధికార పార్టీ ఆశల్ని అడియాస చేస్త్తూ ఫ్రంట్‌లోని కాంగ్రెస్, టిడి పి, టిజెఎస్ ముఖ్య నేతలంతా సిపిఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డిని గెలిపించుకుంటామని సభా వేదిక మీద నుండి ప్రకటన చేశారు.
సురవరం సుధాకర్‌రెడ్డి ప్రసంగిస్తూ కెసిఆర్ పాలనలో రాష్ట్రానికి లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరిగాయ ని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని వి మర్శించారు. నిజాం నవాబు కూడా రోజు కార్యాలయానికి వెళ్ళి పని చేసే వారని , కెసిఆర్ మాత్రం సెక్రెటేరియెట్‌కు వెళ్ళక సంవత్సరాలు గడిచిందన్నారు. గెలిస్తే సేవ చేస్తా ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా అంటున్న కెసిఆర్ గెలిచి నా ఓడినా ఫరక్ పడదన్నారు. ఆయన ఇప్పటికే సెక్రెటేరియెట్‌కు రాకుండా ఫామ్ హౌజ్‌లో రెస్టు తీసుకుంటున్నారని, ఎన్నికల్లో ఓడించి పూర్తి కాలం రెస్ట్ ఇద్దామన్నా రు. కెసిఆర్ గెలిస్తే కాళేశ్వరం ఓడితే శనీశ్వరం అంటున్నారని, కెసిఆర్ అనే శనీశ్వరాన్ని ఓడించి తెలంగాణను విముక్తి చేసుకోవాలన్నారు. మోడీ చేపట్టిన ప్రజా వ్యతిరే క నోట్ల రద్దు, జిఎస్‌టి విధానాలకు కెసిఆర్ మద్దతు పలికారని, రాష్ట్రపతి ఉపరాష్ట్రతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు ఓటేశారని, కాబట్టి కెసిఆర్ కు ఓటేస్తే మోడీకి వేసినట్లేనన్నారు. హుస్నాబాద్ నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చాలా కాలంగా సిద్ధమయ్యారని, కూటమి అభ్యర్థిగా చాడ వెం కట్‌రెడ్డి అవకాశం రావడంతో ఆయన పెద్ద మనసుతో మద్దతు పలికి, సంపూర్ణంగా సహకరించడం శుభ సూచకమన్నారు. తాజా సర్వే ప్రకారం హుస్నాబాద్ స్థానం నుండి ప్రజా ఫ్రంట్ గెలువబోతున్నదని, ఓడిపోయే అభ్యర్థికి ఓటెయ్యొద్దన్నారు.
ఎల్.రమణ మాట్లాడుతూ చాడ వెంకట్‌రెడ్డి ప్రతిపాదనతోనే ప్రజాఫ్రంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ విషయంపై తొలుత తామిద్దరం, ప్రొఫెసర్ కోదండరామ్, తరువాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చించి కూటమిని సాకారం చేశామన్నారు. ప్రజాఫ్రంట్‌కు హుస్నాబాద్ సీటును కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే ప్రభుత్వంలో తన ద్వారా వచ్చే నిధులను ఈ నియజకవర్గం అభివృద్ధికి ఖర్చుచేస్తానని ప్రకటించారు. హైదరాబాద్‌లో పెద్ద దొర ఉంటే, హుస్నాబాద్‌లో గడీ దొర(తాజా మాజీ ఎంఎల్‌ఏ) ఉన్నారని విమర్శించారు.ఇక్కడ నాన్‌లోకల్ ఎంఎల్‌ఏ కావాలా? పక్కా లోకల్ ఎంఎల్‌ఏ చాడ వెంకట్‌రెడ్డి కావాలా? అని అన్నారు. సిపిఐ చొరవతోనే నేరెళ్ళ ఘటనను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. సామాజిక తెలంగాణ కోసం, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికిహుస్నాబాద్ నుండే చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
ప్రజా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డిని గెలిపించడం చారిత్రక అవసరమని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఒక ప్రాంతంలో పార్టీని పణంగా పెట్టి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, అందుకు తెలంగాణ సమాజం గత ఎన్నికల్లో కృతజ్ఞత చూపించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే కసి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్‌లను గల్లంతు చేశారని తెలిపారు. సూటుకేసులు, మటలకు ఆశపడినా, బెదిరింపులకు భయపడినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చేవారు కాదన్నారు. 2014లో పొరపాటు జరిగింద ని, ఈ సారి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించా రు. తెలంగాణ రాష్ట్రం కోసం కీలక నిర్ణయం తీసుకుని ఉద్యమించిన జాతీయ పార్టీ సిపిఐ అని, ఆ పార్టీకి కాం గ్రెస్, టిడిపి, టిజెఎస్, ఎంఆర్‌పిఎస్ మద్దతునిస్తోందని, ఒక్క సీటు అటూ ఇటైనా దొర రాజ్యం కొనసాగుతుందని, కాబట్ట కాంగ్రెస్, టిడి పి, టిజెఎస్ శ్రేణులు పట్టుదలతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
కటకం మృత్యుంజయం మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం దురదృష్టమన్నారు. చాడ వెంకట్‌రెడ్డి గెలిస్తే ప్రజాఫ్రంట్ ప్రభుత్వం వస్తుందని, 58 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్యపు పెన్షన్‌లు వస్తాయని, ఇళ్ళు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పా రు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ చాడ వెంకట్‌రెడ్డి పోరాటయోధుడని, తెలంగాణ కోసం పని చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన తా ను, బొమ్మ వెంకటేశ్వర్లు, చాడ వెంకట్‌రెడ్డి కాలంలో చే సిన పులే తప్ప కొత్తగా చేసిందేమి లేదని విమర్శించారు.
చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్‌ను ఇంటికి పంపించేందుకే ప్రజాకూటమి ఏర్పాటైందన్నారు. కరువు విలయతాండవం చేసే హుస్నాబాద్‌లో సాగు నీరందించేందుకు తాను ఎంఎల్‌ఏగా ఉన్నప్పుడు గౌరవెల్లి, గండివెల్లి రిజర్వాయర్‌లకు శంకుస్థాపన చేయించామని, కాని ఇప్పటివరకు అది పూర్తి కాలేదన్నారు. గెలిచాక సంవత్సరంలోగా ప్రతి ఎకరానికి నీరు తీసుకువస్తాన్నారు.
కన్హయ్యకుమార్ మాట్లాడుతూ తెలంగాణ సిఎం, ప్రధాని ఇద్దరూ దొంగలేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, మ్యానిఫెస్టోలను అమలు చేయలేదన్నారు. బిజెపికి అవసరమైన ప్రతీసారి మద్దతిచ్చిన కెసిఆర్ విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీలను ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. మహిళలను గౌరవించని సమాజం వెనకబడినట్లేనని, కెసిఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం శోచనీయమన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తన పాటలతో సభికులను ఉర్రూతలూగించారు.