పరిహారంగా రూ. కోటిన్నర చెల్లించాలన్న కోర్టు ఆస్ట్రేలియా న్యాయస్థానం
సిడ్నీ: పరువునష్టం కేసులో భాగంగా వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్‌కు దాదాపు రూ. కోటిన్నర మూడు లక్షల ఆస్ట్రేలియా డాలర్లు చెల్లించాలని ఆస్ట్రేలియా కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2015వరల్డ్ కప్ సమయంలో చోటు చేసుకున్న ఘటనపై 2016లో ఫైర్ ఫాక్స్ అనే మీడియా సంస్థ ప్రచురించిన కథనాలను ఖండిస్తూ గేల్ పరువు నష్టం దావా వేసిన సంగతి విదితమే. దీనిపై సమగ్ర విచారణ జరిపిన సదరు న్యాయస్థానం గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2016 జనవరిలో ఫైర్ ఫాక్స్ సంస్థ గేల్‌కు వ్యతిరేకంగా చాలా కథనాలు ప్రచురించింది. వరల్డ్ కప్ ట్రైనింగ్ సెషన్ సందర్భంగా వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో మసాజ్ చేసే మహిళతో గేల్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ కథనాల్లో ప్రచురించింది.
పరువునష్టం కేసులో గేల్ విజయం
RELATED ARTICLES