ఎంపి జివిఎల్ నర్సింహారావు
హైదరాబాద్ : సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జి.వి.ఎల్. నర్సింహారావు విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, ఎంఐఎం మత వైఖరి కారణంగా పేదల ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 257ను ఎపిలోని టిడిపి ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని, అవినీతిపరులను కాపాడేందుకు సిబిఐ, ఐటి అధికారులను అడ్డుకుంటోందని జివిఎల్ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ రాజకీయాల కారణంగా కొంత మంది ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని వెల్లడించారు.
కెసిఆర్ వ్యవహార శైలి.. సమాఖ్య స్పూర్తికి విరుద్ధం
RELATED ARTICLES