యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్
తాండూరు : దేశ అభివృద్ధి బిజెపికే సాధ్యమని, ఐదు రాష్ట్రలలో జరుగుతున్న ఎన్నికలలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు బిజెపి అభ్యర్థి పటేల్ రవిశంకర్కు మద్దుతుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరైన యోగి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కేవలం బిజెపి ప్రభుత్వాన్నికే సాధ్యమన్నారు. సబ్కా సాత్… సబ్కా వికాస్ ప్రధాని మోడి నినాదంతో ముందుకు సాగుతున్నారని అ న్నారు. జరుగుతున్న ఐదు రాష్ట్రలో జిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందన్నారు. బిజెపి ప్రభుత్వమే దేశ ప్రజలకు నాగరీకతకు గ్యారంటీ ఇస్తుందన్నారు. మిజోరం, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ రాష్ట్రలోల బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల సమస్యలను తెలిసిన, మీరు ఎప్పుడు పిలిస్తే పలికే తాండూరు బిజెపి అభ్యర్థి పటేల్ రవిశంకర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.