ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్ : గడీల పాలనను అంతం చేసింది కూడా టిడిపియేనని, తెలుగుదేశం జెండా ఎగరాలి తెలంగాణ నిండా‘ అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ అధికారంలోకి తీసుకురావడం ద్వారా కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పలకాలన్నారు. ప్రజాఫ్రంట్ తరఫున శేరిలింగంపల్లి నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్న భవ్య ఆనంద్ ప్రసాద్ విజయం కోసం ఆదివారం బాలకృష్ణ రోడ్ షో నిర్వహించి పలు ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టిడిపి గురించి కెసిఆర్ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని, టిడిపి లేకుంటే కెసిఆర్ ఎక్కడి నుంచి వచ్చేవారని ఆయన అన్నారు. తెలుగు వారిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది టిడిపి జెండాయే’ అని బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున జరగాలంటే ప్రజా ఫ్రంట్‌ను గెలిపించాలని ఆయన ఓటర్లను ఆయన కోరారు.
గడీల పాలనను అంతం చేసింది టిడిపి
RELATED ARTICLES