బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘కవచం’. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌లో నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న పేక్షకుల ముందుకు రానుంది. కవచం యుఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను రెడ్ హార్ట్ మూవీస్ తీసుకున్నారు. డిసెంబర్ 6నే భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఇప్పటికే 10 మిలియన్లకు మించి వ్యూస్‌ని రాబట్టింది. కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఎస్‌ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమా టోగ్రఫీ అందిస్తున్నారు. కాగా డిసెంబర్ 2న ఆడియో విడుదల కార్యక్రమం భీమవరంలో భారీగా జరగనుంది.