శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రధాని విక్రంసింఘెని తొలగించి రాజపక్షను నియమించిన దరిమి లా బయలుదేరిన అధికార కుమ్ము లాట కారణంగా పార్ల మెంటరీ వ్యవహారాలు నడిపేందుకు గాను ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు సోమవారం అంగీకరించాయి.
ఇదిలావుండగా, నవంబర్ 16న పార్లమెంటులోపల హింసకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటా నని స్పీకర్ జయసూరియ హెచ్చరించారు. “చాంబర్లోకి ఆయుధాలు తేవటం, కారం చల్లుకోవటం, పిడిగుద్దులు గుద్దుకోవటం, ఆస్తులు ధ్వంసం చేయటం వంటి క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలపై తాను ఇప్పటికే నివేదిక కోరానని” ఆయన పార్టీ నాయకులకు చెప్పారు. ఆ రభస సందర్భంలో స్పీకర్ పోలీసులను సభలోకి రప్పించారు, వీడియో తీయించారు.
వివాదాస్పద ప్రధాని రాజపక్షకు మూడవసారి బలనిరూపణ పరీక్షకై మంగళవారం సమావేశమైన పార్లమెంటు 10 నిముషాల్లోనే వాయిదా పడింది.
రాజపక్ష పార్లమెంటులో బలనిరూపణలో విఫలమైనందున అధ్యక్షుడు సిరిసేన పార్లమెంటును 20మాసాల ముందే రద్దుచేసి, జనవరి 5 న ఆకస్మిక ఎన్నికలను ఆదేశించటం, సుప్రీంకోర్టు అధ్యక్షుని నిర్ణయాన్ని రద్దుచేసి, ఎన్నికల సన్నాహాలు నిలుపుచేయటం తెలిసిందే.
శ్రీలంక పార్లమెంటుకు సెలెక్ట్ కమిటీ
RELATED ARTICLES