తిరుమల: తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు అధికంగా గెలిచే అవకాశం ఉందని తన సర్వేలో తేలిందని లగడపాటి పేర్కొన్నారు. 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని లగడపాటి జోస్యం చెప్పారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శివకుమార్ రెడ్డి గెలుస్తారని, ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో అనిల్ జాదవ్ గెలుస్తారని లగడపాటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ప్రలోభాలకు తలొగ్గడం లేదని, ఈ సారి ఎన్నికల్లో ప్రజలు అధిక మంది రెబెల్స్‌కు పట్టం కట్టడం సంతోషకరమని మాజీ ఎంపీ లగడపాటి చెప్పారు. లగడపాటి వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో అలజడి మొదలైంది.
లగడపాటి సర్వేలో ప్రధాన పార్టీలకు షాక్..!
RELATED ARTICLES