గౌహతి: భారత దేశాన్ని ప్రపంచ దేశాలు గొప్ప శక్తిగా భావిస్తున్నాయని, అంతర్జాతీయ భద్రత, వ్యాపారం, వాణిజ్యం వంటి అంశాల్లో మన దేశం ప్రపంచంలో కీలక భూమిక పోషించగలదని అనుకుంటున్నాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. గురువారం గౌహతిలోని డిఫెన్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ… నేను వియత్నాం, ఆస్ట్రేలియాల్లో పర్యటించినప్పుడు ఆ రెండు దేశాల ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో భారత్ గల విశిష్టత ఎంటో అర్థమైందన్నారు. ప్రపంచం ప్రస్తుతం భారత్ విభిన్న కోణంలో చూస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ శాంతికి కట్టుబడి ఉన్నప్పటికీ… తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఇండియా సహకరించగలదని భావిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం భారత భద్రత దళాలకు ఎలాంటీ సవాళ్లనైనా ఎదుర్కోనే సత్తా ఉందని పేర్కొన్నారు.
భారత్ ను ప్రపంచం గొప్ప శక్తిగా భావిస్తోంది: రాష్ట్రపతి
RELATED ARTICLES