న్యూఢిల్లీ: ఐఎన్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరానికి మరోసారి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను జనవరి 15వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థలను కోర్టు ఆదేశించింది. ఐఎన్ మీడియా కేసులో సిబిఐ, ఇడిలు తనను అరెస్టు చేయకుండా కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ముందస్తు జామిన్ పొడగించాలని చిదంబరం వేసిన పిటిషన్ విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. చిదంబరం 2007లో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఐఎన్ మీడియాకు విదేశీ పెట్టుబడులు వచ్చేలా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ ప్రభావితం చేశారనే ఆరోపణలపై సిబిఐ 2017 మే 15న ఆయనపై కేసు నమోదు చేసింది. ఐఎన్ మీడియాకు విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు సహకరించి ఆయన లబ్ధిపొందారని కూడా పొందారని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే చిదంబరం మనీల్యాండరింగ్ కూడా పాల్పడినట్లు ఆరోపిస్తూ ఇడి కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసును విచారిస్తున్న కోర్టు ఇంతకు ముందు చిదంబరానికి ఇచ్చిన తాత్కాలిక ముందస్తు బెయిల్ పొడగిస్తున్నట్లు పేర్కొంది.
ఐఎన్ మీడియా కేసులో చిదంబరానికి మరోసారి ఊరట
RELATED ARTICLES