న్యూఢిల్లీ: వెస్టిండీస్ వేదికగా జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత సీనియర్ బ్యాట్స్ మిథాలీ రాజ్ జట్టు నుంచి తప్పించడంపై గత కొన్ని రోజులగా తీవ్ర స్థాయిలో విమర్శలు జరుగుతున్నాయి. జట్టులో నుంచి తనను కావాలనే తప్పించి అవమానించారని, భారత జట్టు కోచ్ రమేశ్ పొవార్, బిసిసిఐ పాలకమండలి సభ్యూరాలు డయానా ఎడూల్జీపై బిసిసిఐకి మెయిల్ ద్వారా మిథాలీ రాజ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం బిసిసిఐ పాలక మండలిని కలిసిన కోచ్ రమేశ్ పొవార్ మిథాలీపై వివర్శలు గుప్పించాడు. ఆమె తనను బ్లాక్ చేసిందని ఆరోపించాడు. ఓపెనింగ్ ఆడుతానని పట్టుబట్టిందని, లేకుంటే ఇప్పుడే ప్రపంచకప్ నుంచి తప్పుకుని రిటైర్మెంట్ ప్రకటిస్తానని బెదిరించిందని పొవార్ చేప్పాడు. దీనిపై తాజాగా స్పందించిన మిథాలీ రాజ్ కోచ్ మండిపడింది. తన జీవితంలో ఇదొక్క చీకటి రోజంటూ ట్విట్టర్ వేదికగా ఆమె ఆవేధన వ్యక్తం చేసింది. గత 20 ఏళ్లుగా దేశం కోసం ఎంతో నిబద్ధతతో ఆడుతున్న తనపై ఒకరోజు ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తుతాయని ఊహించలేదని ఆమె చెప్పింది. రెండు దశాబ్దాలుగా తన కుటుంబం కంటే క్రికెట్ ఎక్కువ సమయం ఇచ్చాను. కానీ ఈ రోజు తన దేశ భక్తిని అనుమానిస్తూన్నారని ఆమె తీవ్ర అవేధన వ్యక్తం చేసింది. అయితే మిథాలీ రాజ్ మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. మాజీలు ఆమెకు అండగా నిలిస్తూ జట్టు మేనేజ్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా సునీల్ గవాస్కర్ కూడా మిథాలీకి అండగా నిలిచారు. కోహ్లీ ఒక మ్యాచ్ గాయపడి తర్వాతి మ్యాచ్ కోలుకుంటే అప్పుడు అతనిని కూడా జట్టు నుంచి తొలిగిస్తారా అని బిసిసిఐకి ప్రశ్నించారు. మహిళా క్రికెట్ జట్టులో మిథాలీ కూడా పెద్ద ప్లేయరన్న విషయం మర్చిపోవద్దన్నారు. ప్రపంచకప్ వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేసి మంచి ఫామ్ ఉన్న సీనియర్ క్రీడాకారిణిని కీలకమైన మ్యాచ్ జట్టు నుంచి తప్పించడం పెద్ద తప్పేనని గవాస్కర్ అన్నారు. మరోవైపు సంజయ్ మంజ్రేకర్, మరి కొందరూ సీనియర్లు కూడా మిథాలీకి మద్దతుగా నిలిచారు.
నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ రాజ్
RELATED ARTICLES