అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో మన భారతదేశం చైనా తర్వాత రెండవస్థానంలో ఉంది. 2017లో వివిధ అమెరికన్ విశ్వవిద్యా లయాల్లో 2లక్షలమందికిపైగా భారతీయ విద్యార్థులున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. 4,81,106 మంది విద్యార్థులతో చైనా అగ్రస్థానంలో ఉంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు చెందిన స్టూడెంట్ అండ్ ఎక్సేంజి విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(సివిస్) ఈ నివేదిక విడుదల చేసింది. 2017లో వివిధ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో 15లక్షల మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 2,49,763 మందికిపైగా భారతీయులు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో చైనీయులు, భారతీయులు సగంమంది. వారి తర్వాత స్థానాల్లో మూడు ఆసియా దేశాలున్నాయి దక్షిణ కొరియా (95,701), సౌదీ అరేబియా (72,358), జపాన్ (41,862). టాప్ 10 లోని ఇతర దేశాలు కెనడా, వియత్నాం, బ్రెజిల్, తైవాన్, మెక్సికో.
కాగా స్టెమ్ ఆప్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్), ఆపరేషనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి) ఎంచుకున్న విద్యార్థుల్లో భారత్ టాప్లో ఉంది. స్టెమ్ డిగ్రీ ఉత్తీర్ణులకు 24మాసాలపాటు ఒపిటి పొడిగింపు లభిస్తుంది. విద్యార్థి చదువు ముగిసేముందుగా ప్రీ కంప్లీషన్ ఒపిటి తీసుకుంటారు. 2017లో స్టెమ్ ఆప్ట్ విదేశీ విద్యార్థులు 89,839 మందిలో 50,507 మంది భారతీయు లు. చైనా (21.705), దక్షిణ కొరియా (1670), తైవాన్(1360), ఇరాన్ (1161)తదుపరి స్థానాల్లో ఉన్నాయి. స్కూలు విద్య కు అమెరికాకు వెళ్లటాన్ని భారతీయులు ఎంచుకోరు. కాగా హైయ్యర్ సెకండరీ విదేశీ విద్యార్థుల్లో చైనీయు లు 44,573 మంది ఉండగా, దక్షిణ కొరియా (6,842), వియత్నాం (6,071), మెక్సికో (2,865), బ్రెజిల్ (1926) తదు పరి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా విద్యారంగాన్ని విదేశీ విద్యార్థులు ముఖ్యం గా చైనా, భారత్ విద్యార్థులు ఎంతగా పోషిస్తున్నారో ఇది విదితం చేస్తున్నది.
అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో రెండవ స్థానంలో భారత్
RELATED ARTICLES