HomeOpinionArticlesప్రపంచ పోటీశ్రేణిలో ఎదగాలంటే...

ప్రపంచ పోటీశ్రేణిలో ఎదగాలంటే…

జయాపజయాలు కేవ లం రాజ్యాల మధ్య జరిగే యుద్ధాలు, సైనిక శక్తికి సంబంధించిన విషయాల ని చరిత్ర పాఠ్యాంశాలు మనకు బోధించాయి. దసరా పర్వదినం రావణ సేనపై రామదండు సాధిం చిన ఆశ్వయుజ దశమి నాటి విజయానికి గుర్తు. దాడులు ప్రతిదాడులు అస్త్రశాస్త్రాల ప్రయోగ ప్రక్రియలో ఇరుపక్షాల బలనిరూపణగా కాక ఇవాళ గెలుపు ఓటములను నూతన దృక్పథంతో ఆలోచన చేయవలసి వుంది. వర్తమానాన్ని విజ్ఞాన యుగం (Knowledge Era) అంటున్నాం, స్వయం చలనయుగం (Age of Automation) అంటున్నాం. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ప్రకటించిన ప్రపంచ పోటాపోటీ సూచీ (Global Competitive Index) లో శ్రేణి (Rank) ని బట్టి ఆయా దేశాల జయాప జయాలపై నిర్ధారణకు రావచ్చు. ఒక దేశం‘పోటీ శ్రేణీకరణ’లో అధమ స్థాయిలో-ఉన్న చోటే ఉన్నా, పైకి ఎదగ లేకపోయినా, మరింత క్రిందకు దిగ జారినా ఆ దేశం అపజయాన్ని మూటగట్టుకున్న ట్టేనని భావించాలి.
దసరా రేపు అనగా ప్రపంచ ఆర్థిక వేదిక 2018 సంవత్సరానికి గాను ‘పోటీ శ్రేణీకరణ సూచిక’ను వెల్లడించింది. దీనిలో నూటా నలభై దేశాల జాబితాలో మన దేశం యాభై ఎనిమిదో స్థానంలో ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలది ఒకటో స్థానం కాగా, సింగపూర్‌, జర్మనీ, స్విట్జ ర్లాండ్‌, జపాన్‌, నెదర్లాండ్స్‌, హాంకాంగ్‌, బ్రిటన్‌, స్వీడన్‌, డెన్మార్క్‌లు వరుసగా పదిస్థానాలను కైవసం చేసుకున్నాయి. చైనా ఇరవై ఎనిమిదవ స్థానంలో, రష్యా నలభై మూడో స్థానంలో, దక్షిణా ఫ్రికా అరవై ఏడో స్థానంలో, బ్రెజిల్‌ డ్బ్బు రెండో స్థానంలో, మన సరిహద్దు దేశాలైన శ్రీలంక ఎనభై ఐదో స్థానంలో, బంగ్లాదేశ్‌ నూటా మూడో స్థానం లో, పాకిస్థాన్‌ నూటా ఏడో స్థానంలో ఉన్నాయి. 1971లో రూపుదిద్దుకొని లాభాపేక్ష రహిత సంస్థ గా నడుస్తున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఎప్పటికప్పు డు ఆర్థిక ప్రాతిపదికన ప్రపంచ దేశాల ఉత్పాదకత స్థాయిని, అభివృద్ధి గతిని శాస్త్రీయంగా విశ్లేషించి వెబ్‌సైట్‌ లో పొందుపరుస్తుంది. తన లక్ష్యమైన ‘సామాజిక ఆకృతిగా ఉన్నటువంటి వ్యాపార, రాజకీయ, విద్యావ్యవస్థలను వాటి ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితిని మెరుగు పరచడం’ లో భాగంగా 2000 సంవత్సరం దావోస్‌ సదస్సు నుండి ప్రజానేత్ర పురస్కారాలు (Public Eye Awards) కూడా అందజేస్తుంది. 2011 నుండి ‘జెండర్‌ డిబేట్‌’ ను ప్రారంభించి ఆర్థ్ధికరంగంలో మహిళల నిష్పత్తిని పెంచటం కోసం దృష్టి సారించింది.
2018 ప్రపంచ పోటీ శ్రేణీకరణ సూచికను గమనిస్తే ‘బ్రిక్స్‌’ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, సౌతాఫ్రికా) దేశాలతో పాటు ‘సార్క్‌’ (అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, నేపాల్‌, మాల్దీవులు, పాకిస్థాన్‌, శ్రీలంక) దేశాలు సైతం అత్యంత వెనుకంజలో ఉండడం ప్రత్యేకించి మన దేశానికి ఎంతో నష్టదాయకం. ప్రపంచంతో పోటీ పడలేక పోతున్నాం అంటే మనం జ్ఞానరంగంలో స్వయం చలనరంగంలో వెనుకబడి ఆర్థికంగా ఓడి పోతున్నామనే అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే మేథో సంపదలో వీగిపోతున్నామని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో ప్రఖ్యాత జీవ సాంకేతిక శాస్త్రవేత్త ‘క్రేగ్‌ వింటర్‌’ చెప్పిన ‘Intellectual property is a key aspect for economic development’ అనే మేథో సంపత్తిని గురించిన అభిభాషణ ఎంతో ఆలోచించ దగినది. ప్రవాస భారతీయుల మేధస్సు మనకు డాలర్లు తెస్తే తేవచ్చు, కానీ భారతీయ ఉత్పాద కతకు, పోటీ శ్రేణీకరణ సూచికలో మన స్థానం ఉన్నతికి చేసే మేలు తక్కువేనని చెప్పక తప్పదు.
ప్రపంచ పోటీ శ్రేణీకరణ సూచికలో ఆయా దేశాలు అమెరికా 85.6%, సింగపూర్‌ 83.5%, జర్మనీ 82.8%, స్విట్జర్లాండ్‌ 82.6%, జపాన్‌ 82.5%, నెదర్లాండ్స్‌ 82.4%, హాంకాంగ్‌ 82.3%, బ్రిటన్‌ 82%, స్వీడన్‌ 81.7%, డెన్మార్క్‌ 80.6% స్కోరు తో మొదటి పది స్థానాల్లో నిలువగా భారత్‌ 60.8%తో బాగా వెనుకబడి ఉంది. ఈ స్కోరు కోసం వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఆయా దేశాలకు సంబంధించి పన్నెండు అంశాలను 1.సంస్థలు, 2.మౌలిక సదుపాయాలు, 3.స్థిర స్థూల మార్కెట్‌ వనరు, 4.మంచి వైద్యం మరియు ప్రాథమిక విద్య 5.ఉన్నత విద్య-శిక్షణ, 6.మార్కెట్‌ వస్తు సామర్థ్యం, 7.మార్కెట్‌ శ్రామిక సామర్థ్యం, 8. మార్కెట్‌ ఆర్థికాభివృద్ధి, 9.సాంకేతిక నియంత్రణా ధికారం, 10.స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్‌ నిడివి, 11.అధునాతన ఉత్పత్తి ప్రక్రియ 12.వినూత్నత్వా లను ప్రాతిపదికగా తీసుకున్నది. ఈ పన్నెండు అంశాల్లో ప్రకృష్టమైన సంస్థలు మన దేశంలో చాలా తక్కువ. వీటిల్లో మనం అత్యంత వేగంగా దూసుకెళ్తే తప్ప పోటీ శ్రేణీకరణ సూచిక లో మనస్థానం మెరగవదు. ఇక్కడ మెరుగవ కుండా మనం ఆర్థిక విజయాలు సాధించలేం.
భారత గణాంకాల సంస్థ-ఢిల్లీలో టెక్సాస్‌ విశ్వ విద్యాలయానికి చెందిన సందర్శక పరిశోధకులు డెయిన్‌ కొఫి మరియు డీన్‌ స్పియర్స్‌ దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ‘ఇండియా ఎక్కడికి వెళ్తుంది’ (Where India Goes) గ్రంథాన్ని ఇటీవల ప్రచురించారు. చదువులు సంస్థాపనలను కాసేపు పక్కన పెడితే Where India Goes చెపుతున్న కఠిన వాస్తవాలు ఇట్లా ఉన్నాయి.
మన దేశం ఇప్పటికీ బహిరంగ మల విసర్జన (Abandoned Toilets)లోనే మగ్గుతోంది. ఎక్కడ చూసినా అభివృద్ధి మోడుబారి (Stunted develop ment) ఉంది. కులాల వ్యయం (The Costs of Castes)అనే దారుణమైన సాంఘిక స్థితి నుండి బయటకు రాలేకపోతున్నాం. కాస్తో కూస్తో ఆదాయం చేతికొస్తే మనం విద్య, వైద్యం కోసం కాకుండా అనుత్పాదక విలాసం వస్తువుల కొనుగోలుకై ఖర్చు చేస్తాం ‘The Indian economy has recently experienced many years of rapid economic growth. House hold surveys show that more and more Indians are own assets such as fans ,cellphones and motorcycles’ అని టెక్సాస్‌ అధ్యాపకులు విస్మయం వ్యక్తం చేశారు. మనం మన అత్యధిక మానవ వనరుల నుండి, మనం మన అత్యుత్తమ సహజవనరుల నుండి, మనం మన మార్కెట్‌ కోసం వేటిని ఎట్లా తయారు చేసుకోవాలి? అనే విషయంలో స్పష్టత, నిశ్చయం విధానం లేదు, దీన్ని పరిష్కరించి సమగ్రాభివృద్ధికి దోహదం చేసే పారిశ్రామిక సంస్థలు, విద్యా వ్యవస్థలు అవసరం.
అధికారం ఎన్ని చేతులు మారినా నిరంతర అభివృద్ధి ప్రణాళిక అమలులో లేకపోవడమే అన్నింటా అధోగతితో పాటు ‘గ్లోబల్‌ కాంపిటిటివ్‌ ఇండెక్స్‌’ లో మనకు ఆశాజనక స్థానం లభించక పోవడానికి కారణం. మించి పోయిందేం లేదు. ఇప్పటికైనా పాలకపక్షాలు, మీడియా సంస్థలు తలుచుకుంటే అరిష్టాలు తొలగి దేశం అన్నింటా అగ్రగామిగా నిలవగలదు. కావాల్సింది తపన, దార్శనికత. వీటికి తోడు ‘షెవార్ట్‌ సైకిల్‌’ (Plan ప్రణాళిక -do అమలు -Study పరిశీలన -Action పూరకం) వ్యాపార యాజమాన్య ప్రగతి సూత్రం. జనానికి పని సంస్కృతి అలవరచడ మనేదే అత్యావశ్యకం.

 


డాక్టర్‌ బెల్లి యాదయ్య
9848392690
ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా.
dr.bellipoet@gmail.com

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments