ఇతరులకు ఇవ్వడం అనేది గొప్ప అనుభూతి. మనకు ఉన్న దానిలో కాస్తో కూస్తో
ఎదుటివారికి ఇస్తే.. ఆ ఆనందంగా వేరు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే థ్యాంక్స్
గివింగ్ అనే కాన్సెప్ట్ ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఈ థ్యాంక్స్ గివింగ్ స్పెషల్ సీజన్
ఆరంభమైంది. విదేసాల్లో నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ థ్యాంక్స్ గివింగ్ గొప్ప
పండుగలా జరుపుకుంటారు. ఇప్పుడు ఈ కాన్సపెట్ విదేశాలకే పరిమితం కాలేదు. అన్ని
దేశాల్లోనూ ఆచరణలో ఉంది. ఇప్పుడు ఈ థ్యాంక్స్ గివింగ్ కాన్సెప్ట్‌కు మరింత అందాన్ని
ఆనందాన్ని కాలిఫోర్నియా వాల్‌నట్స్‌తో జరుపుకోండి. కేవలం బహుమతిగా ఇవ్వడమే
కాక.. మీ ప్రత్యేక భోజనాల్లో వీటిని యాడ్ చేయండి. దీనివల్ల థ్యాంక్స్ గివింగ్ పండుగ
ఆనందంగా జరుపుకోవడమే కాదు.. ఆరోగ్యంగా కూడా మారుతుంది. ఇందులో ఉండే
ఒమేగా త్రీ , ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అందుకే.. ఈ ఏడాది చెఫ్ సవ్యసాచి గొరాయ్ మరియు దీబా రాజ్‌పాల్ చేసిన ఈ
ప్రత్యేకమైన డిషెష్‌ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంతో
పాటు ఆరోగ్యాన్ని పొందండి.
1. రోస్టెడ్ టర్కీ స్టఫ్పెడ్ విత్ వాల్‌నట్స్ మరియు గ్రేజ్‌డ్ ఫ్రూట్ మరియుహనీ (బై
చెఫ్ సవ్యసాచి గొరాయ్)
కావాల్సిన పదార్థాలు
1 టర్కీ చికెన్ (సుమారు 6 కేజీలు)
ఉప్పు మరియు మిరియాల పొడి
4 ఉల్లిపాయలు
5 కేరట్స్
కొంచెం బటర్
స్టఫ్పింగ్ కోసం
12 హోల్ ప్లమ్స్ (కట్ చేసినవి)
12 ఎండిన ఆప్రికాట్స్ (ముక్కలుగా తరిగినవి)
60 గ్రాముల క్యూరంట్స్
60 ఎమ్‌ఎల్ బ్రాందీ
60 గ్రాముల బట్టర్
2 యాపిల్స్ (తొక్క తీయనివి)
2 పెద్ద ఉల్లిపాయలు (ముక్కలు)
2 సెలిరీ స్టింక్స్ (ముక్కలు)
100 గ్రాముల బ్లూ బెర్రీస్
200 గ్రాముల కాలిఫోర్నియా వాల్‌నట్స్
4 ముక్కలు బ్రెడ్
250 ఎమ్ చికెన్ బ్రాత్ సూప్
1 టేబుల్ స్పూన్ లవంగాలు
1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్
1/4 టేబుల్ స్పూన్ కారం పొడి
1 టీ స్పూన్ కొత్తిమీర తురుము
3 గుడ్లు
రుచికి తగినంత ఉప్పు మరియు మిరియాల పొడి
గ్లేజ్‌డ్
375 గ్రాముల పువ్వుల తేనె
125 గ్రాముల ఉప్పులేని బట్టర్
2 తరిగిన లవంగాలు, అల్లం
2 టీ స్పూన్స్ బిర్యాని ఆకు
రుచికి తగినంత ఉప్పు మరియు మిరియాల పొడి
తయారు చేసే విధానం
1. ముందురోజు రాత్రే ప్రూన్స్, ఆప్రికాట్స్, క్యూరంట్స్ అన్నింటికి ఒక బౌల్‌లో తీసుకోవాలి.
వాటికి కొద్దిగా బ్రాందీ కలపాలి. మిశ్రమాన్ని మొత్తంగా కలిపి ఒక కవర్‌తో కప్పి పక్కనపెట్టు
కోవాలి.
2. ఉదయాన్నే మనం సిద్ధంగా చేసుకున్న టర్కీ చికెన్‌ను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత
రాత్రి మనం నానబెట్టుకున్న మిశ్రమాన్ని చికెన్ లోపల పెట్టాలి. ఆ తర్వాత దాన్ని గంట
సేపు పక్కనపెట్టుకోవాలి.
3. రోస్ట్ ప్యాన్ తీసుకుని ఓవెన్‌లో పెట్టుకోవాలి. ఓవెన్ హీట్ 180 డిగ్రీల సెంటిగ్రేడ్
వచ్చేవరకు వెయిట్ చెయ్యాలి.
4. ప్యాన్ వేడి అయిన తర్వాత దానిపై కొద్దిగా బటర్ వెయ్యాలి. అందులో వాల్‌నట్స్, ఫ్రూట్స్
ఉల్లిపాయలు, సెలరీ వేసి ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి.
10 నిమిషాల తర్వాత ప్యాన్‌ని దించి ఉడికిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. దీనికి బ్రెడ్
ముక్కల్ని రెడీగా చేసుకుని సిద్ధం చేసుకోవాలి.
5. ఆ తర్వాత రెండు టీ స్పూన్ల ఆయిల్‌లో వాల్‌నట్స్ ముక్కల్ని దోరగా, బంగారు వర్ణంలో
వచ్చేవరకు వేయించాలి. ఆతర్వాత వాటికి యాపిల్ మిక్చర్ యాడ్ చేసి సిద్ధంగా
ఉంచుకోవాలి.
6. వీటికి ఫ్రూట్స్, బ్లూ బెర్రీస్, లవంగాలు, కొత్తిమీద, అల్లం, బిర్యాని ఆకు, గుడ్లు అన్నీ
కలిపి పక్కనపెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా టర్కీలో పెట్టాలి. ఆ పైన వాల్‌నట్స్‌తో
అందంగా అలంకరించాలి.
7. టర్కీ చికెన్ లెగ్స్‌ని చిన్న తాడుతో కట్టాలి.(మిశ్రమం బయటకు రాకుండా)
8. సిద్ధంగా టర్కీ చికెన్‌పై బట్టర్, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి మొత్తంగా అంటేట్లు
చూసుకోవాలి.
9. ఇప్పుడు సిద్ధంగా ఉన్న టర్కీ చికెన్‌ని తీసుకుని దానికి చుట్టూ కేరట్స్, ఉల్లిపాయలు
వేసి.. 180 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో ఉడకబెట్టాలి.
10. ఈలోపుగా మనం గ్రేజ్ తయారు చేసుకోవాలి. ఇందుకోసం చిన్నపాటి సాస్‌ప్యాన్
తీసుకుని దాన్ని కాస్త వేడి చెయ్యాలి. బట్టర్, గార్లిక్ పేస్ట్ వేసి అటూ ఇటూ తిప్పుడూ
మాడిపోకుండా చూసుకోవాలి. లైట్‌గా వేగిన తర్వాత దానికి తేనె, బిర్యాని ఆకులు, ఉప్పు,
పెప్పర్ వేసి… తేనె మొత్తం ఆ మిశ్రమానికి పట్టే వరకు కలియతిప్పాలి.
11. ఒక గంట తర్వాత చికెన్ టర్కీ ఉడికి ఉంటుంది. దాన్ని బయటకు తిసి.. తేనెతో సిద్ధం
చేసుకున్న మిశ్రమాన్ని చికెన్‌పై బ్రష్‌తో రాయాలి. ఆ తర్వాత మళ్లీ మరోసారి ఓపెన్‌లో
పెట్టి.. 20 నుంచి అరగంట సేపు వేడి చెయ్యాలి.
12. టిప్ – టర్కీ చికెన్ ఉడికింది లేని తెలుసుకోవాలంటే చిన్న చిట్కా ఉంది.
అదేంటంటే.. ధర్మామీటర్ తీసుకుని.. చికెన్ చెస్ట్ మరియు లెగ్ పీస్ దగ్గర పెడితే వేడి 80
డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి. అప్పుడే అది పర్‌ఫెక్ట్‌గా వేగినట్లు. అందుకే ముందుగానే..
చికెన్‌ని అల్యూమినియం కాయితం చుట్టడం వల్ల అది మాడిపోకుండా ఉంటుంది.
టర్కీ చికెన్ ఉడికిన తర్వాత ఒక అరగంట పాటు దాన్ని బయటపెట్టాలి. ఆ తర్వాత
అల్యూమినియం కవర్ తీసేసి..వేడి వేడిగా సర్వ్ చేస్తే… అదిరిపోయే టర్కీ చికెన్ రెడీ
అయినట్లే.
2. డుల్సే డే లెచే ఎగ్‌లెస్ పంప్‌కిన్ వాల్‌నట్ క్వినోవా టార్ట్ (బై దేబా రాజ్‌పాల్)
కావాల్సిన పదార్థాలు
టార్ట్ బేస్
60 గ్రాముల క్వినోవో పిండి
100 గ్రాముల వాల్‌నట్స్
30 గ్రాముల బ్రౌన్ షుగర్
40 బట్టర్ లేదా నెయ్యి
ఫిల్లింగ్
300 గ్రాముల డుల్సే డే లెచే
250 గ్రాముల గుమ్మడికాయ ప్యూరీ
2 టేబుల్‌స్పూన్ గుమ్మడికాయ పై స్పైస్
100 గ్రాముల వాల్‌నట్స్
25 గ్రాముల కార్న్ ఫ్లోర్
తయారు చేసే విధానం
1. టార్ట్ బేస్ కోసం ముందుగా ఓవెన్‌ను 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి వచ్చేవరకు హీట్
చేయాలి.
2. వాల్‌నట్స్, క్వినోవా ఫ్లోర్, బ్రౌన్ షుగర్ అన్నింటికి తీసుకుని.. ఒక జార్‌లో మెత్తగా
పిండి చేసి పెట్టుకోవాలి.
3. మిక్స్ అయ్యేందుకు అందులో బట్టర్ లేదా నెయ్యి కలపాలి
4. 8” టార్ట్ షెల్ తయారయ్యేందుకు మిశ్రమాన్ని లూజ్‌గా కలుపుకోవాలి. కలిపిన
మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
5. ఇక ఫిల్లింగ్ కోసం ఓవెన్ టెంపరేచర్‌ని 150 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గించుకోవాలి.
6. డుల్సే డే లేచె, కార్న్ ఫ్లోర్ మరియు పంప్‌కిన్ ప్యూరీని ఒక జార్‌లో వేసి.. మెత్తగా
చేసుకోవాలి.
7. మెత్తగా అయిన మిశ్రమానికి వాల్‌నట్స్ కలుపుకోవాలి. ముందుగానే వాల్‌నట్స్ ని
చిన్న చిన్న ముక్కలుగా తరుగుకుంటే బావుంటుంది.
8. ఒక గంట బేక్ అయినతర్వాత దాన్ని తీసి బయట కాసేపు ఆరబెట్టుకోవాలి
9. ఒక రాత్రి మొత్తం దాన్ని చిల్ చేసుకోవాలి.
10. ఉదయాన్నే స్వీట్ లేని క్రీమ్ లేదా ఐస్‌క్రీమ్‌తో సర్వ్ చేస్తే సరి.
3. డార్క్ చాక్లెట్ పంప్‌కిన్ కాలిఫోర్నియా వాల్‌నట్ ఓట్ పుడ్డింగ్ ( బై దేబా
రాజ్‌పాల్)
కావాల్సిన పదార్థాలు
250ఎమ్‌ఎల్ లో ఫ్యాట్ క్రీమ్ {20%}
75 గ్రాముల పంప్‌కిన్ ప్యూరీ
1 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్
30 గ్రాముల కోకో పౌడ్
40 గ్రాముల ఓట్స్
150గ్రాములు : 52% డార్క్ చాక్లెట్ (ముక్కలుగా
తరిగిన)
75 గ్రాముల బ్రౌన్ షుగర్
50 గ్రాముల తేనె
75 గ్రాముల వేయించి ముక్కలుగా కోసుకున్న
కాలిఫోర్నియా వాల్‌నట్స్
టాపింగ్ కోసం
వేయించిన కాలిఫోర్నియా వాల్‌నట్స్, పెర్సిమన్ ముక్కలు, ఆర్గానికి రోజ్ పెటల్స్
తయారు చేసే విధానం
1. కాలిఫోర్నియా వాల్‌నట్స్ మినహాయించి మిగిలిన అన్ని ఒక ప్యాన్‌పై వేసి
ఉడకబెట్టాలి. మిశ్రమం చిక్కగా వచ్చేవరకు ఉడకబెట్టాలి.
2. మిశ్రమం చిక్కబడిన తర్వాత దాన్ని తీసి పక్కనపెట్టి ఆరనివ్వాలి.
3. ఆ తర్వాత కాలిఫోర్నియా వాల్‌నట్స్ చల్లాలి
4. ఒక రాత్రి మొత్తం మిశ్రమాన్ని పక్కనపెట్టాలి. ఆ తర్వాత గ్లాసుల్లో కానీ బౌల్స్ కాని
వేసి.. రెండు మూడు గంటల ఫ్రిజ్‌లో పెట్టాలి.
5. చల్లగా అయిన మిశ్రమంపై కాలిఫోర్నియా వాల్‌నట్స్, ఫిగ్స్ లాంటి ఫ్రెష్ ఫ్రూట్స్
ముక్కలు, పెర్సిమన్ ముక్కల్ని పైన చల్లాలి.
6. ఆ తర్వాత దానిపై కలరింగ్ కోసం ముందే సిద్ధం చేసుకున్న ఆర్గానికి రోజ్ పెటల్స్,
దానిమ్మ గింజలు చల్లి సర్వ్ చేసుకోవాలి.
4. కాలిఫోర్నియా వాల్‌నట్స్ చాక్లెట్ పంప్‌కిన్ టార్ట్ (బై
దేబా రాజ్‌పాల్)
కావాల్సిన పదార్థాలు
వాల్‌నట్ టార్ట్ బిస్కెట్ బేస్
50 గ్రాముల వేయించిన కాలిఫోర్నియా వాల్‌నట్స్
50 గ్రాముల డైజెస్టివ్ బిస్కెట్‌స్
50 గ్రాముల నెయ్యి {లేదా బట్టర్}
చాక్లెట్ పంప్‌కిన్ ఫిల్లింగ్ కోసం
200 గ్రాములు: ముక్కలుగా చేసుకున్న 72% డార్క్
కవర్చెల్ చాక్లెట్
50 గ్రాముల సింగిల్ క్రీమ్ (వేడి చెయ్యాలి, ఉడకబెట్టేందుకు కాదు)
100 గ్రాముల ఫ్రెష్ పంప్‌కిన్ ఫ్యూరీ {200 గ్రాముల గుమ్మడికాయని పేస్ట్ చేసి
పెట్టుకోవాలి}
ఒక ఆరంజ్
25 మిల్లీ మ్యాపిల్ సూప్ {లేదా తేనె}
15 గ్రాముల వాల్‌నట్ బట్టర్
5గ్రాముల పై స్పైస్ {లేదా దాల్చిన చెక్క పొడి /గరమ్ మసాలా }
తయారు చేసే విధానం
1. వాల్‌నట్ టార్ట్ కోసం ముందుగా కాలిఫోర్నియా వాల్‌నట్స్‌ని ఒక జార్‌లోవేసుకోవాలి.
అందులో డైజెస్టివ్ బిస్కెట్స్ కూడా వేసి రెండూ కలిసి మిశ్రమంలా చేసుకోవాలి.
2. కలుపుకున్న మిశ్రమాన్నికి నెయ్యి వేసి కలపాలి.
3. 7" లూజ్ టార్ట్ కోసం మిశ్రమాన్ని ఒక ప్లేట్ వేసి కొన్ని బేస్ ముక్కలుగా కట్ చేసి
పెట్టుకోవాలి.
4. ముందే హీట్ అయిన ముక్కల్ని పది నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా
చేసుకోవాలి.
5. ముందుగా ఓపెన్‌ని 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చెయ్యాలి.
6. పదినిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
7. చాక్లెట్ పంప్‌కిన్ ఫిల్లింగ్ కోసం ముందుగా చాక్లెట్‌ని ఓపెన్‌లో పెట్టి హీట్ చేసి
పక్కన పెట్టుకోవాలి.
8. దానిపై క్రీమ్ వేసి ఐదు నిముషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత మన దగ్గరున్న
మిశ్రమాలన్నింటిని కలిపి దానిపే వేయాలి.
9. కాల్చిన వాల్‌నట్స్ ని బిస్కెట్ టార్ట్ పై షెల్‌గా పోయాలి.
10. 20 నిమిషాల పాటు 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి ఆ తర్వాత కూల్
అయ్యేవరకు ఓవెన్‌లో ఉంచాలి.
12. చల్లారిన రెండు గంటల తర్వాత దానిపై డార్క్ చాక్లెట్ వేసి, దాన్ని కాలిఫోర్నియా
వాల్‌నట్స్ తో టాపింగ్ చేయాలి.
13. ఆ తర్వాత ముక్కలుగా కోసి సర్వ్ చేస్తే సరి.