హైదరాబాద్ : ప్రజాకూటమి పొత్తులో భాగంగా సనత్‌నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దీంతో ఈ స్థానంపై మొదటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ పెద్దలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీటు దక్కకపోవడంతో తన అనుచరులతో మాట్లాడి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. సనత్‌నగర్‌లో టిడిపికి పట్టు ఉందని, ఈ స్థానాన్ని తమకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఈ స్థానాన్ని టిడిపికి కేటాయించారు. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్‌ను ఖరారు చేసింది టిడిపి అధిష్టానం. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపొందారు. అనంతరం ఆయన టిఆర్ ఎస్‌లో చేరారు.
ఇండిపెండెంట్‌గా బరిలోకి మర్రి శశిధర్‌రెడ్డి?
RELATED ARTICLES