ప్రజాపక్షం/ఎల‌్‌బినగర్ : బిజెపి, టిఆర్ ఎస్ పాలనలో బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు బిసి నా యకులు విమర్శించారు. కెసిఆర్ కుటుంబాన్ని కూకటి వేళ్లతో పెకిలిద్దామంటూ పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో బిసి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో 50 సీట్లు వెనుకబడిన వర్గాలకు కేటాయిం చాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్ నగరం ఎల్‌బినగర్ సరూర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిసిల సింహగర్జన బహిరంగసభ జరిగింది. సభకు పలువురు బిసి సంఘాల నేతలు హాజరయ్యారు. సభకు బిసి సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిసిలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అయితేనే వారి బతుకులు మారుతాయని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలలో ముఖ్యమంత్రి పదవికి అర్హులు లేరా అంటూ ప్రశ్నించారు. బిసి ఉద్య మం బహుజన ఉద్యమమని, అన్ని రాజకీయ పార్టీలు అద్దెకొంపలు అనే విషయాన్ని బిసిలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సంపదను సృష్టిస్తున్నది బిసి లేనని, కానీ దానిని దోచుకుంటుంది కొందరేనన్నారు. ఇప్పటికి బిసిలు డబ్బులు, మందుకు ఓట్లు అమ్ము కుం టున్నారని, వ్యవస్థ బాగుపడాలంటే రాజ్యాధికారం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు బిసిల సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగలేదన్నారు. బర్లు, గొర్లు వద్దు, అందరికీ చదువుకావాలి, చట్టసభలో జనాభాకు తగినన్ని సీట్లు కావాలని ఆయన డిమాండ్ చేశారు. బిసి సంఘం ఉద్యమం బిసిలకు చట్టసభల్లో 50 శాతం సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. బిసిలకు రాజ్యాధికారం కల్పించిన వ్యక్తులకే చరిత్రలో చిరస్థాయిగా స్థానం ఉంటుందన్నారు. మైనార్టీ సోదరులు ఎన్నికల్లో ముస్లింలు ఉంటే అందరు వారికే ఓట్లు వేస్తారని, లేకుంటేనే ఇతర పార్టీలకు వేస్తారని చెప్పారు. బిసిలు మైనార్టీలను చూసి వారిలో పరివర్తన తెచ్చుకోవాలన్నారు.
ప్రగతి భవన్‌ను ప్రజాసుపత్రిగా మారుస్తాం : రమణ
ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ప్రజా ఆసుపత్రిగా మారుస్తామని టిటిడిపి అధ్యక్షులు ఎల్ .రమణ అన్నారు. అధికారం, పదువుల్లో ఉన్న బిసిలు ఇతర బిసిలకు చేయూతనివ్వాల న్నారు. కెసిఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వలేదు కానీ, ప్రజాధనం వందల కోట్లతో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకున్నారని చెప్పారు. కెసిఆర్ కుటుంబాన్ని కూకటివేళ్లతో పీకివేయాల్సిన సమయం వచ్చిందన్నారు. వచ్చే ప్రభుత్వం 15 లక్ష ల కోట్ల బడ్జెట్‌తో వస్తుందని రమణ చెప్పారు. తెలంగాణ నాలుగు చేతుల్లో బందీగా ఉందని, బిసిలు కలిసి తెలంగాణాను విడిపించుకోవాలని సూచించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బిసిలు ఎందుకు ఏకం కావడం లేదని ప్రశ్నించారు. ఎంబిసి కార్పొరేషన్ రూ. 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కెసిఆర్ కేవలం వంద కోట్లు కేటాయించారని, అందులో ఖర్చు చేసింది కూడా 34 కోట్లేనని చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, బిఎల్ఎఫ్ చైర్మన్ తమ్మినేని వీరభధ్రం మాట్లాడుతూ బిఎల్ఎఫ్ ధ్యేయం బహుజనుల రాజ్యాధికారమేనన్నారు. ప్రజా గాయకులు గద్దర్ మాట్లాడుతూ బిసిలకు రాజ్యాధికారం రావాలంటే బిసిలలో ఓట్ల విప్లవం రావాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపి మధుయాష్కీ, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, సిపిఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేశం, మన ఇంటిపార్టీ అధ్య క్షులు చెరుకు సుధాకర్, డాక్టర్ ర్యాగ అరుణ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం బిసిల సంక్షేమం కోసం రూపొందించిన 21 తీర్మానాలను సభలో ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్య క్రమంలో ఎర్ర సత్యనారాయణ, బిసి నాయకులు గుజ్జ క్రిష్ణ, మిద్దెల జితేందర్, కటం నర్సింగ్‌తో పాటుగా వివిధ జిల్లా బిసి సంఘం నాయకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.
బిజెపి, టిఆర్ పాలనలో బిసిలకు అన్యాయం
RELATED ARTICLES