HomeNewsAndhra pradeshఆర్థిక వ్యవస్థకు రూపాయి దెబ్బ

ఆర్థిక వ్యవస్థకు రూపాయి దెబ్బ

దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగేళ్ల సునాయాస ప్రయాణం తదుపరి అంతిమంగా చిక్కుల్లో పడింది. రూపాయి విలువ పతనం చివరి సమ్మెట దెబ్బ కావటంలో ఆశ్చర్యం లేదు. డాలర్ రూపాయి మారక విలువ ఈ ఏడాది 12శాతం దిగజారింది. ఇందుకు కనిపించే కారణం పెట్రో లియం ధరల పెరుగుదల. ఇందుకు దోహదం చేసిన ఇతర కారణాలు ఎగుమతులు మంద గించటం, విలాసవస్తువుల వినిమయం, దిగుమతి పెరుగుదల. టెలివిజన్ సెట్లు, మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దేశంలో ఉత్పత్తి చేసే బదులు సునాయాసంగా దిగుమతి చేసు కుంటున్నారు. స్టాక్ మార్కెట్లలో హేతువిరుద్ధమైన ఉత్సాహం (దీన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది). విదేశాలనుంచి తీసుకున్న వాణిజ్య రుణాలను భారీగా వినియోగించటం. బ్యాంకుల్లో బలహీనత వీటికి తోడు కావటంతో ప్రాథమిక సూత్రాలు మరింత బలహీనపడినాయి.
2013లో అంతర్జాతీయ ఆయిలు ధరలు బ్యారెల్ 110 డాలర్లు దాటింది. అయినా పెట్రో లు, డీజిల్ రిటైల్ ధర ఇప్పటికన్నా తక్కువ ఉంది. వాటిపై పన్నులు తగ్గించటమే అందుకు కారణం. 2016లో బ్రెంట్ క్రూడ్ అంతర్జాతీయ ధర బ్యారెల్ ఒకటికి 29 డాలర్లకు పతనమైంది. అయితే సుంకాలు తగ్గించలేదు. ఈ సెప్టెంబర్ మధ్యలో క్రూడ్ ఆయిలు ధర 80 డాలర్లకు చేరు కున్నప్ప టికీ ప్రభుత్వం సుంకాలు తగ్గించలేదు. పర్యవ సానంగా రిటైల్ పెట్రోలియం ధరలు వేగంగా పెరిగాయి. (అయితే అంతర్జాతీయ ఆయిలు ధర బ్యారెల్ 86 డాలర్లకు చేరుకోవ టంతో కేంద్ర ప్రభుత్వం అంతిమంగా పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు రూ.2.50తగ్గించింది. దానిలో రూ. 1.50 ఎక్సైజ్ సుంకం.(ఆ తగ్గింపు వారం పది రోజుల్లో తుడిచిపెట్టుకపోయింది). అదే సమయ లో భారతదేశ ఆయిలు దిగు మతులు 2015-16 లోని 83 బిలియన్ డాలర్ల నుంచి 2018 మార్చి చివరకు 109 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో అది మరింత పెరిగి వాణిజ్య లోటు పెంచుతుంది.
కరెంట్ అక్కౌంట్ పెచ్చుపెరగటానికి ఆయి లు దిగుమతి ధర పెరగటం ఒక్కటే కారణం కాదు. ఆయిల్ యేతర వాణిజ్యలోటుకూడా వేగం గా పెరుగుతున్నది. అందుకు కారణం 2013-14 మరియు 2017-18 మధ్య ఎగుమతుల వృద్ధిరేటు సగటున కేవలం 1.3 శాతం మాత్రమే పెరగటం. ఇందుకు కారణాలనేకం. పెట్టుబడులు కొరవడటం వాటిలో ఒకటి.
భారతదేశ ఎగుమతుల్లో సుమారు 40 శాతం చిన్న, మధ్యతరహా పరిశ్రమలనుండి జరగటం గుర్తుచేసుకోదగింది. వస్త్రాలు, దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, చర్మ ఉత్పత్తులు, ఇంజినీరింగ్ ఉత్ప త్తులు వాటిలో ప్రధానమైనవి. డీమానిటైజేషన్ (రూ.1000, రూ.50౦ కరెన్సీనోట్లరద్దు) వాటిని దెబ్బ కొట్టింది. వాటి యజమానుల్లో చాలామంది కనీసం కొన్ని మాసాలపాటు దుకాణాలు మూసి వేయవలసి వచ్చింది. అంతేగాక, వస్తుసేవల పన్నును ఆదరాబాదరా ప్రవేశపెట్టాక, జిఎస్ రిఫండ్ సకాలంలో రాకపోవటంతో వారిలో కొందరి నిర్వాహక పెట్టుబడి ప్రభుత్వం వద్ద నిలిచిపోయింది.
వాణిజ్యవస్తువుల దిగుమతిఎగుమతుల మధ్య అగాధం పెరుగుతున్నప్పటికీ, రెండు ఆర్థిక కార ణా లు సమతౌల్యాన్ని అనుమతించాయి. అవి సాఫ్ట్ విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల నుంచి స్వదేశంలోకి చెల్లింపులు. ఇవి గత కొద్ది సంవత్సరాల్లో ఎదుగుబొదుగులేకుండా ఉన్నాయి. సాఫ్ట్ గతంలోని ఆశ్చర్యకరమైన వృద్ధిరేటు ఇక సాధ్యం కాదు. విదేశాలలోని ముఖ్యంగా పశ్చిమాసియాదేశాలలోని కార్మికుల చెల్లింపులు 2014 నుంచి స్తంభించటానికి ప్రధాన కారణం ఇక్కడ అవకాశాల్లో విశ్వాసం కోల్పోవటంగా భావించవచ్చు. ఆ చెల్లింపులు 2014 నుంచి రమా రమీ 60 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నా యి. అంతకుక్రితం దశాబ్దంలో అవి నిలకడగా వృద్ధిచెందాయి.
అదే సమయంలో టెలివిజన్ సెట్లు, మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు డిమాండ్ పెరుగుదల కనుగుణంగా పెరిగాయి. వాటిని “మేడ్ ఇన్ ఇండియా” చేసేందుకు ప్రయ త్నం జరగలేదు. వీటి దిగుమతి విలువ ప్రస్తుతం సాఫ్ట్ ఎగుమతుల విలువతో సమానంగా ఉంది. 2009-10లో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగు మతి విలువ సాఫ్ట్ ఉత్పత్తుల ఎగుమతుల విలువలో 46 శాతం ఉండగా, 2016-17లో 58 శాతానికి చేరింది. అక్కడితో ఆగలేదు. 2017 -18 లో అది 70 శాతాన్ని చేరుకుంది. “మేక్ ఇన్ ఇండియా” గూర్చి గొప్పలు చెప్పుకుంటున్న ప్పటికీ, విస్తృతంగా ఉపయోగించే వినిమయ వస్తువులకు దేశంలోని డిమాండ్ నెరవేర్చే సమర్థత ప్రభుత్వానికి లేదని ఇది సూచిస్తున్నది. సాఫ్ట్ ఎగుమతుల ద్వారా సుమారు 70 బిలి యన్ డాలర్లు ఆర్జిస్తున్న ఆర్థిక వ్యవస్థ బలం ఇక్కడ ఉత్పత్తి చేయాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి వల్ల హరించుకుపోతున్నది.
వాణిజ్యలోటు అంటే ఎగుమతులను మించిన దిగుమతులు. కరెంట్ అక్కౌంట్ లోటు పెరుగుదల అందుకు సూచిక. ఆ లోటు 2016-17లో ఉన్న 14.4 బిలియన్ డాలర్లనుంచి 2017-18లో 48.7బి.డాలర్లకు చేరింది. మదుపుదారులు స్టాక్ మార్కెట్ నుంచి వైదొలుగుతుండటం కూడా మరో కారణం. 2018-19తొలి త్రైమాసికంలో నిష్క్ర మించిన విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడి 8.1బి. డాలర్లుకాగా అంతకు క్రితం సంవత్సరం అదే కాలంలో ఆ తరహా పెట్టుబడి ఆగమనం 12.5 బి.డాలర్లు, ఇటీవల కాలంలో ఈ ఉపసంహరణ పెరిగింది.
ఐఎల్ అండ్ ఎఫ్ కుదేలుకావటం పెట్టు బడుల మార్కెట్ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. దీన్నిప్పుడు ప్రభుత్వం దాదాపుగా స్వాధీనం చేసుకుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల పరిస్థితీ అస్తుబిస్తుగా తయారైంది.
స్టాక్ మార్కెట్ ధరలు మరింత పతనమైతే విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు(ఎఫ్ మనదేశం నుంచి మరింతగా ఉపసంహరించుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది; రూపాయి విలువ మరింత క్షీణిస్తుంది. పర్యవసానంగా అనేక భారీ కంపెనీలు విదేశీ వాణిజ్య రుణాల కింద విదేశాలనుంచి భారీ మొత్తాలు రుణాలు తీసుకుంటాయి.
మొత్తం విదేశీ రుణం 530 బి.డాలర్లలో 38 శాతం విదేశీ వాణి జ్యరుణం అయినందున వాటి లాభాలు తగ్గు తాయి. రూపాయి దిగజారుడు ధోరణి కొనసాగే కొలది దాన్ని దెబ్బ ప్రభుత్వాన్ని తాకుతుంది. ద్రవ్య లోటును, ఆయిలు ఇతర దిగుమతుల ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోతుంది; స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తగ్గుదల, కంపెనీలు తీసుకున్న విదేశీ రుణాల తిరిగి చెల్లింపు వ్యయం పెరగటం జరుగుతుంది.

యోగి అగ్గర్ వాల్

(ముంబై పాత్రికేయుడు)

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments