కొలంబో: శ్రీలంగలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెర దించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాజపక్స, విక్రమ సింఘేలకు పార్లమెంట్ తమ బలం నిరూపించుకునేలా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధ్యక్షుడు మైత్రిపాల గురువారం పార్లమెంట్ సస్సెషన్ ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం పార్లమెంట్ సమావేశపరుచనున్నట్లు వెల్లడించారు. అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘేను తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం నవంబర్ 16వ తేదీ వరకు పార్లమెంట్ సస్పెండ్ చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో పార్లమెంట్ పరిసరాల్లో గత శుక్రవారం పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణ కూడా ఏర్పడింది. మంత్రి రణతుంగను పార్లమెంట్ ప్రవేశించకుండా నిరోధించినందుకు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరపడం సంచలనంగా మారింది. అయినప్పటికీ సిరిసేన వెనక్కు తగ్గకుండా రాజపక్సకే అవకాశం కల్పించారు. అంతేకాక పార్లమెంట్ సస్పెండ్ చేసి రాజపక్సకు అవసరమైన మెజార్టీని సాధించేందుకు అవకాశమిచ్చారు. అయితే మైత్రిపాల తీసుకున్న ఈ నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీయడమే కాకుండా…దేశంలో అనిశ్చిత పరిస్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలో సిరిసేన వీలైనంత త్వరగా పార్లమెంట్ సమావేశపర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి అభ్యర్థికి సంబంధించిన బలనిరూపణకు అవకాశం ఇచ్చేందుకు పార్లమెంట్ సమావేశ పరుస్తున్నట్లు తెలుస్తోంది.
మ్యాజిక్ ఫిగర్ 113
శ్రీలంక పార్లమెంట్ మొత్తం సభ్యుల సంఖ్య 225గా ఉంది. ఇందులో విక్రమ సింఘేకు చెందిన యూనైటెడ్ నేషనల్ పార్టీకి 106 మంది సభ్యుల మద్దతుంది. మ్యాజిక్ ఫిగర్ విక్రమసింఘే చేరుకోవాలంటే ఆయనకు మరో 7 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ఈ ఏడుగురు సభ్యులను ఆయన తన వైపు తిప్పుకోల్గితే తిరిగి ఆయనే ప్రధాని పీఠంమెక్కె అవకాశం కనిపిస్తోంది. ఇక రాజపక్స విషయానికొస్తే ఆయనకు ప్రస్తుతం సభలో 95 మంది సభ్యుల బలముంది. ఆయనకు మరో 18 మంది సభ్యుల సపొర్టు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజపక్స విక్రమ సింఘే పార్టీ నుంచి 5 మంది సభ్యులను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. వెరసి తన సంఖ్యను 100కు చేర్చడం ద్వారా మరో 13 మంది సభ్యుల మద్దతు కూడగట్టుకొని ప్రధాని పదవిని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే విక్రమసింఘే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మ్యాజిగ్ ఫిగర్ దగ్గరలోనే ఉన్నా… నవంబర్ 05 వరకు ఎవరు మ్యాజిగ్ ఫిగర్ చేరుకోగలరనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
మళ్లీ నేనే పీఎం
ఇక విక్రమ సింఘే మాత్రం మ్యాజిగ్ ఫిగర్ సాధించే అంశంలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురువారం బిబిసితో మాట్లాడిన ఆయన శ్రీలంకకు తిరిగి ప్రధాని కాబోతున్నట్లు ప్రకటించారు. నాకు నమ్మకముంది. నేను సభలో బలం నిరూపించుకుంటాను. అధ్యక్షుడి బాధ్యత కేవలం పార్లమెంట్ ఎవరికి మెజార్టీ ఉంటే వారినే ప్రధానిగా నియమించాలి. అధ్యక్షుడు ఏర్పాటు చేయబోతున్న పార్లమెంట్ సమావేశంలో మ్యాజిగ్ ఫిగర్ అవసరమైన సభ్యుల మద్దతు సాధించి తీరుతా తెలిపారు.