వెనుకబాటుతనం తాండవించే ఆఫ్రికాఖండంలో పాలనాధికారంలో మహిళలు సమానత్వం పొందటం ఆహ్వానించదగ్గ పరిణామం, ఇతర దేశాలకు మార్గదర్శకం. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియా గురువారం నాడు 26సభ్యుల క్యాబినెట్ మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించి లింగసమానత్వ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండ్రోజుల తదుపరి ర్వాండా దాన్ని అనుసరించింది. మంత్రివర్గంలో 50 శాతం, ఆపై మహిళలున్న బహుకొద్ది ఐరోపా దేశాల సరసన చేరింది, పార్లమెంటు సభ్యుల్లో 61 శాతం మహిళలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. నిర్ణయాలు తీసుకునే పాత్రల్లో ఎక్కువగా మహిళలుండటం లింగవివక్షను, మహిళలపై నేరాలను తగ్గిస్తుందని ర్వాండా అధ్యక్షుడు పాల్ కగేమ్ అన్నారు. మహిళలు పురుషులకన్నా తక్కువ అవినీతిపరులని ఇథియోపియా ప్రధాని అబీ అన్నారు. మనలాంటి పురుషాధిక్యదేశాల్లో అలంకారప్రాయంగానే కొద్దిమంది మహిళలకు పదవులు లభిస్తాయి కాని, మన ముఖ్యమంత్రి కెసిఆర్ తన మంత్రివర్గంలో ఒక్క మహిళ కూ స్థానం కల్పించలేదు. ఈ దొరతనాన్ని, అప్రజాస్వామికాన్ని మహిళలు సహిస్తారా?