న్యూయార్క్: కాలిఫోర్నియాలోని యోజమైట్ నేషనల్ పార్క్ నిటారుగా 800 అడుగుల ఎత్తున్న ప్రదేశం నుంచి జారిపడి భారతీయ దంపతులు మృతిచెందారు. విష్ణు విశ్వనాథ్(29), మీనాక్షి మూర్తి(30) యోజమైట్ నేషనల్ పార్క్ టాఫ్ట్ పాయింట్ నుంచి ఈ వారం జారిపడి చనిపోయారు. అమెరికాలో నివసిస్తున్న ఈ దంపతులు భారత్ చెందినవారని సోమవారం గుర్తించారు. ఆ దంపతులిద్దరూ సాఫ్ట్ ఇంజినీర్లు.
శాన్ జోస్ ఉన్న సిస్కో కంపెనీలో ఇటీవల సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగం పొందిన విశ్వనాథ్ న్యూయార్క్ నుంచి షిఫ్ట్ అయ్యారు. ఆ దంపతులిద్దరూ ప్రపంచమంతటా పర్యటించి తాము చేసిన సాహసాలను ‘హాలీడేస్ అండ్ హ్యాపిలీ ఎవర్ ఆఫ్టర్స్’ అనే తమ బ్లాగ్ రాశారు. యోజమైట్ లోయ, యోజమైట్ జలపాతం వంటి సుందర నెలువులు ఉండే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన టాఫ్ట్ పాయింట్ కింద ఉన్న ఎతైన ప్రదేశంలో గురువారం వారి మృతదేహాలను రేంజర్లు కనుగొన్నారు.
కాలిఫోర్నియాలో భారతీయ దంపతుల మృతి
RELATED ARTICLES