HomeNewsLatest Newsహైదరాబాద్‌లో భారీవర్షం

హైదరాబాద్‌లో భారీవర్షం

పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం
రహదారులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించిన జిహెచ్‌ఎంసి సిబ్బంది

ప్రజాపక్షం/హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్‌, దుండిగల్‌, గాగిల్లాపూర్‌, గౌడవల్లి, మునీరాబాద్‌, డబిల్‌పూర్‌లలో ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. ఫలితంగా పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. ముందే సమాచారం ఉన్న జిహెచ్‌ఎంసి సిబ్బంది, డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది రహదారులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించే పనిలో ఉన్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. అకస్మాత్తుగా కురిసిన భారీవర్షం జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, బోరబండ, ఇఎస్‌ఐ, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లిలో ఇంటికి వెళ్లే వారికి ఇబ్బందులకు గురిచే సింది. అటు కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు రామంతపుర్‌, ఉప్పల్‌, పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం పడింది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ట్రాఫిక్‌లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు వదిలే సమయంలో కావడంతో రోడ్లపై రద్దీ పెరిగిపోయింది. మరోవైపు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొండా మార్కెట్‌ ఓల్డ్‌ జైల్‌ ఖానా ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో ఐదు దుకాణాలు ధ్వంసం కాగా ఒకరికి గాయాలు అయ్యాయి. ప్రహరీగోడ మట్టిపెళ్లలు పడడంతో ఐదు ట్రైలర్‌ దుకాణాలు, ఒక పూల దుకాణం దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌లో రాబోయే గంటలో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలుచోట్ల వర్షం నీరు నిలిచింది. పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు సాయంత్రం 6 గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కోరింది. అందరూ అప్రమత్తంగా ఉంటూ.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చూపింది.
మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో రాగల నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపునకు వంగి ఉందని చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, భువనగిరి జిల్లాల్లోనూ ఈదురుగాలులతో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులతో వర్షాలు పడే సూచనలున్నాయని హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments