HomeNewsLatest Newsరూ.10 వేల కోట్లివ్వాలి

రూ.10 వేల కోట్లివ్వాలి

వరద సాయం రూ.10 వేల కోట్లివ్వాలి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాన్ని నిర్వహించాలి

బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలి

జాతీయ విపత్తుగా ప్రకటించాలి

సిపిఐ రాష్ట్ర సమితి డిమాండ్‌

సాయంపై ఎపిని ఒకలా,తెలంగాణను మరోలా చూడడం తీవ్ర అభ్యంతరకరం 

వరద బాధితుల కోసం సిపిఐ తన వంతుగా అన్ని రకాలుగా సహాయ భాగంగా ఎంఎల్‌ఎగా తన ఒక నెల వేతనం రూ.2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి పార్టీ నిర్ణయించినట్లు ప్రకటించారు.

ప్రజాపక్షం/హైదరాబాద్‌
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పలు జిల్లాల్లో అపార నష్టం జరిగిందని, దీనిని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి వరద సహా కింద కనీసం రూ.10 వేల కోట్లు అందించాలని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. వరద బా సహాయాన్ని అందించడంలో కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఓ విధంగా తెలంగాణను మరో విధంగా చూడడం తీవ్ర అభ్యంతరకరమ ని, ఈ వైఖరిని కేంద్రం విడనాడాలని సిపిఐ కోరింది. వరద బాధితులకు నష్ట పరిహారం గతంలోని పాత పద్ధ్దతిలో కాకుండా పూర్తిగా శాస్త్రీయంగా లెక్క కట్టి అందజేయాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహా య కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఎన్‌.బాలమల్లేష్‌, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాలనర్సింహాలతో కలిసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలు భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పొయి తీవ్ర దుఃఖసాగరంలో మునిగి ఉంటే వారిని మానవత్వంతో ఆదుకోవాల్సింది పోయి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విపత్తు నిధులకు సంబంధించి గతంలో ఖర్చు చేసిన యుసిలను ముందుగా అందించాలనడం దారుణమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో రాజకీయాలు చేయడం తగదని మానవత్వంతో కేంద్రప్రభుత్వం తగిన సహాయం అందించే విధంగా చూడాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.
అటవిక యుద్ధానికి తెరలేపిన కేంద్రం
ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను రాక్షసంగా కాల్చి చంపుతూ కేంద్ర ప్రభుత్వం ఆటవిక యుద్ధానికి తెర లేపిందని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖమంత్రి అమిత్‌ షా ఇటీవలే 2026 నాటికి మవోస్టులను పూర్తిగా తుదముట్టించి వారి ఉనికి లేకుండా చేస్తామని ప్రకటించిన వెంటనే వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని, ఈ హింసను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు చేసిన న్యాయ చట్టాలు ఉన్నాయని, ఎవరు తప్పుచేసినా వారిని పట్టుకుని ఈ చట్టాల ప్రకారం శిక్షించాలే తప్ప కాల్చి చంపే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు తప్పలు చేసినా తాము సమర్థించబోమని, ఎవరూ తప్పు చేసినా తప్పు తప్పే అని ఆయన స్పష్టం చేశారు. కేవలం వ్యక్తులను చంపినంత మాత్రాన భావజాలాన్ని అణచలేరని, రాజహింస ఇదే విధంగా కొనసాగితే ప్రజల తిరుగుబాటు తప్పదని, ఇదే జరిగితే శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో చోటుచేసుకున్న ఘటనలు గుర్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్‌కౌంటర్లపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, కేంద్రం చేపపడుతున్న ఈ ఆటవిక చర్యలను సమర్థించకూడదని ఆయన కోరారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని కూనంనేని సాంబశివరావు కోరారు.
తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర, కర్నాటకలో ఈ ఉత్సవాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుండగా, నిరంకుశ నిజాం రాజుకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు బందూకులు పట్టి విరోచితంగా పోరాడి 4500 మంది వీరమరణం పొందిన తెలంగాణ నేలలో ఇప్పటికీ ఈ ఉత్సవాలు అధికారికంగా నిర్వహించపోవడం ఈ ప్రాంత ప్రజలందరికీ అవమానకరమన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ విలీనమైన సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ చారిత్రాత్మక పోరాటంలో కమ్యూనిస్టుల త్యాగాలు, వీరమరణాలతో కూడిన చరిత్రను పాఠ్యాపుస్తకాల్లో పొందుపర్చి భావి తరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. సాయుధ పోరాటంలో తమ పాత్ర లేకుంటే దాని గురించి మాట్లాడవద్దా అని నేతలు ప్రశ్నిస్తున్నారని, సాయుధ పోరాటం గురించి వారు మాట్లాడితే తమకు అభ్యంతరం లేదని అయితే బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడం మానుకుని చరిత్రను చరిత్రగా గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ముమ్మాటికీ తెలంగాణ సంస్థానం విలీనమే
కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు ప్రజలు నిర్వహించిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే హైదరాబాద్‌ సంస్థానం భారత దేశంలో విలీనమైందని, అది ముమ్మాటికీ విలీనమేనని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. నాడు జరిగిన ఒప్పందంలో సైతం అధికారంగా ‘విలీనం’ అని పొందు పర్చారని ఆయన తెలిపారు. ఈ పోరాటంతో, చరిత్రతో ఏలాంటి సంబంధం లేని బిజెపి తన రాజకీయ మనుగడ కోసం విమోచనం అని, ఇతర రకారకాల ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నదని చెప్పారు. సెప్టెంబర్‌ 17ను విదోహ్ర దినమని అప్పటి నక్సలైట్లు మరో వాదనను చెప్పారని, వారి ఉద్ధ్దేశం ప్రకారం దేశానికి పూర్తి స్వాతంత్య్రం రాలేదనే భావనతో విదోహ్ర దినమనే అభిప్రాయం వ్యక్తం చేశాయని, అయితే నాడు జరిగింది ముమ్మటికీ విలీనమేనని కూనంనేని స్పష్టం చేశారు.
ఎంఎల్‌ఎలు పార్టీ మారితే క్రిమినల్‌ కేసులు పెట్టాలి
రాజకీయపార్టీ మారిన ఎంఎల్‌ఎల అంశాన్ని నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని అసెంబ్లీ కార్యదర్శిని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడాన్ని సిపిఐ స్వాగతిస్తున్నదని కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఒక రాజకీయ పార్టీ నుంచి ఎంఎల్‌ఎగా గెలిచి మరో రాజకీయ పార్టీలో చేరే ఎంఎల్‌ఎల సభ్యత్వాన్ని ఆటోమెటిక్‌గా రద్దు చేయాలని, పైగా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసినందుకు పార్టీ మారిన ఎంఎల్‌ఎపై క్రిమినల్‌ కేసు పెట్టాలని సిపిఐ డిమాండ్‌ చేస్తుందన్నారు. పార్టీ మారితే కేసు పెడతారనే భయం ఉండాలన్నారు. ఒక వేళ ఎన్నికైన పార్టీ నియంతృత్వంగా వ్యవహరిస్తే, అది ఆ ఎంఎల్‌ఎకు నచ్చకపోతే ఆయన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments