HomeNewsBreaking Newsనేడు 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

నేడు 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం

ప్రజాపక్షం /హైదరాబాద్‌
రాష్ట్రంలోని మంగళవారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధా కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ అం చనా మేరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న కురిసే ఆదిలాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, కొమ రం భీం ఆసిఫాబాద్‌, మెదక్‌,మేడ్చల్‌ మల్కాజిగిరి, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డిజిపిజితేందర్‌, విపత్తుల ని ర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఫైర్‌ సర్వీసుల డిజి నాగి రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటి ల్‌లతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్బంగా సి.ఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ, భారీ వర్షాలు కురి సే అవకాశమున్న ఈ జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏలాంటి ఆస్తి, ప్రా ణ నష్టం జరగకుండ అన్ని రకాలుగా ముందుస్తూ జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఇప్పటికే గత 5 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న భారీ వర్షాల వల్ల పరిస్థితు లు తీవ్రంగా ఉండే అవకాశ ఉన్నందున పోలీసు తదితర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్య లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థాని క పరిస్థితుల బట్టి ఆయా జిల్లా కలెక్టర్లు విద్యా సంస్థలకు సెలవుపై నిర్ణయం తీసుకోవాలని సూ చించారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సరక్షిత ప్రాం తాలకు తరలించాలని నిర్మల్‌ కలెక్టర్‌ ను ఆదేశించారు. నిర్మల్‌కు 31 సభ్యులు, నాలుగు బొట్లు ఉన్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపించినట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్ట్‌ నుండి ప్రస్తుతం 20, వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఈ నీటి పరిమాణం మరింత ఎక్కువైతే నే పరీవాహక ప్రాంతాల్లో తగు ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహారా ష్ట్ర పరీవాహక ప్రాంతం నుండి వచ్చే వరద నీటిని ఎప్పటి కప్పుడు తెలుసుకొని తగు జాగ్రత్తలు చేప్టందుకు మహారాష్ట్ర అధికారులతో సమన్వ యం చేసుకోవాలని సూచించారు. కల్వర్టులు, వా గుల వద్ద సంబంధిత లైన్‌ విభాగం అధికారులతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని అన్నారు. హైదరాబాద్‌ నుండి ఏలాంటి సహాయ సహకారాలు కావాలన్న తమను సంప్రదించాలని కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టరేట్‌ లలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ లు 24 / 7 పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిపి జితేందర్‌ మాట్లాడుతూ, మంగళవారం వరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఎస్‌పిలు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి క్రేన్‌ లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments