పారిస్ : పారాలింపిక్స్‌లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3లో నితేశ్ కుమార్ పసిడి గెలిచాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్‌లో 21- 18 23- డానియల్ బెతెల్ (బ్రిటన్)ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన బెతెల్ ఈ సారి కూడా ఫైనల్‌లో చివరి వరకు గట్టిపోటీ ఇచ్చాడు. తొలి గేమ్‌లో భారత షట్లర్ ఆధిపత్యం ప్రదర్శించగా.. రెండో గేమ్ హోరాహొరీగా సాగింది. ఒక దశలో 1 ఆధిక్యంలో నిలిచిన నితేశ్.. తర్వాత కాస్త పట్టు తప్పాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్రిటన్ షట్లర్ వరుసగా పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ కూడా నువ్వానేనా అన్నట్లుగా సాగింది. చివరకు నితేశ్ పైచేయి సాధించాడు. మరోవైపు ఎస్‌ఎల్4లో సుహాస్ యతిరాజ్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. టోక్యోలో రజతం గెలిచిన సుహాస్.. ఈ సారి పసిడి కోసం లుకాస్ (ఫ్రాన్స్)తో తలపడబోతున్నాడు.
మరో రజత పతకం
భారత్ మరో రజత పతకం సాధించింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56లో యోగేశ్ కతునియా (42.22 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. బ్రెజిల్‌కు చెందిన క్లాడినీ బాటిస్టా (46.86 మీ) స్వర్ణం అందుకున్నాడు. గ్రీస్ దేశానికి చెందిన కాన్స్టాంటినోస్ జౌనిస్ (41.32 మీ) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. తాజాగా యోగేశ్ పతకం గెలవడంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం. టోక్యోలోనూ అతడు రజతం సాధించాడు. మరోవైపు.. బ్యాడ్మింటన్ మిక్స్‌డ డబుల్స్ ఎస్‌హెచ్6 కాంస్య పతక పోరులో శివరాజన్- నిత్యశ్రీ నిరాశపర్చారు. 17- 12 ఇండోనేషియా జోడీ సుభాన్-రినా మార్లినా చేతిలో ఓటమి చవిచూశారు.
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణం
RELATED ARTICLES